రామ్ చరణ్ ‘జంజీర్’కు రూ. 6 కోట్ల తలనొప్పి
ముంబై: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'జంజీర్' చిత్రంపై గత కొంత కాలంగా వివాదం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. జంజీర్ ఒరిజినల్ వెర్షన్ రచయితలు అయిన సలీమ్, జావేద్ అక్తర్‌లు తమ కథను మళ్లీ రీమేక్ చేయడానికి తమ అనుమతి తీసుకోలేదని, తమ స్టోరీని వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాము గతంలో కథ రాసింది... ఒకసారి వాడుకోవడానికి మాత్రమే అని, మళ్లీ తమ కథను వాడుకుంటున్నందుకు రూ. 6 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. జంజీర్ సినిమాను హిందీతో పాటు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నందున 3+3 మొత్తం రూ. 6 కోట్లు చెల్లించాల్సిందేనని అంటున్నారు.
కాపీరైట్ అమెండ్ మెంట్ బిల్ 2011ను సమీక్షించిన కమిటీలో సభ్యుడైన జావెద్ అఖ్తర్ ఆ హక్కు ప్రకారం తనకు రావాల్సిన రాయల్టీ కోసం పోరాడుతున్న తొలి వ్యక్తిగా నిలిచారు. కాపీరైట్ బిల్లు ప్రకారం సినిమాలకు సంబంధించి రచయితకు కూడా రాయల్టీ హక్కు ఉంటుంది. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్.


Click it and Unblock the Notifications











