సల్మాన్ ఖాన్ పెళ్లి అయిపోయింది, ఓ బాబు కూడా!
హైదరాబాద్: 'సల్మాన్ పెళ్లి అయిపోయింది...ఇప్పుడేంటి 40 ఏళ్ల క్రితమే పెళ్లయింది. ఓ బాబు కూడా ఉన్నాడు. బాబు పేరు తెలుసా.. ఆమీర్ ఖాన్' ఇదీ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ చేసిన వెటకారపు కామెంట్స్.

తాను బయటకు వచ్చినప్పుడల్లా మీడియా వారు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి అడిగి విసిగిస్తుండటంతో సలీమ్ ఖాన్ ఈ కామెంట్స్ చేసారు. సలీం ఖాన్, సొహైల్ ఖాన్, హెలెన్‌లు కలిసి ముంబైలో ఓ హోటల్ కి డిన్నర్ కి వెళ్లిన సందర్భంగా మీడియా ఎదురు పడి ప్రశ్నలతో విసిగించడంతో ఆయన ఈ కామెంట్స్ చేసారు. అయితే పక్కనే ఉన్న సొహైల్ ఖాన్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసారు.
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ విదేశీ భామ లూలియా వేంటర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని, ఆమెనే వివాహం చేసుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయమై సల్మాన్ మాత్రం ఇప్పటికీ నోరు విప్పలేదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా సల్మాన్ పెళ్లి విషయమై మాట్లాడటానికి ఇష్ట పడటం లేదు. అయితే ఈ ఏడాది చివర్లో సల్మాన్-లులియా వేంటర్ వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











