»   »  అసిన్ కి ఇప్పుడన్నీ ఆ హీరోనే...

అసిన్ కి ఇప్పుడన్నీ ఆ హీరోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Asin
సల్లు భాయ్ కన్ను అసిన్ పై పడినట్లుంది...అందుకే ప్రత్యేకంగా ఆమెను చూస్తున్నాడు అని ముంబై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఈ కొత్త ఎఫైర్ ని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ..అసిన్ కలసి చేస్తున్న లండన్ డ్రీమ్స్ సినిమా షూటింగ్ లో వీళ్ళిద్దరూ దగ్గరయ్యారుట. అసిన్ నటన సల్మాన్ కి విపరీతంగా నచ్చేసిందిట. అందేంకాదు..కత్రినా ఈ మద్య మన వాడ్ని దూరం పెడుతోంది కదా ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


దీనికి తగ్గట్లుగా సల్మాన్ మొన్న ఓనం పండుగ రోజు అసిన్ కి ఏ గిప్ట్ ఇవ్వలేదని నొచ్చుకుని తర్వాత రోజు ఓ స్పెషల్ గిప్ట్ ప్రెజెంట్ చేయటం ఈ న్యూస్ కు పెప్ ని ఏడ్ చేస్తోంది. ఇక ఆమె ముంబైలో సెటిల్ అవ్వటం కోసం అతనుండే బాంద్రా ఏరియాలో ఓ ప్లాట్ చూసి అతనే అడ్వాన్స్ కట్టి ఆమెని ఒప్పించాడుట. ఆ ఫ్లాట్ ..ఫర్నిచర్ తో సహా అదిరిపోయే ఇంటీరియర్ డెకరేషన్ తో ఉండటంతో అసిన్ ఎగిరి గంతేసి సల్లుభాయ్ ని ఆకేసానికి ఫొగడ్తలతో ఎత్తేసిందిట. ఇప్పటికే ఎంతోమందిని (విశ్వసుందరి ఐశ్వర్యతో సహా) తన ప్రేమ లో ముంచి తేల్చిన సల్మాన్ లేటెస్ట్ టార్గెట్ అసినే అంటున్నారు.

అయితే అసిన్ కూడా బాలీవుడ్ లో ఒంటరి ప్రయాణం కష్టమని నిర్ణయానికి వచ్చిందిట. అందులోనూ అమీర్ ఖాన్ తో గజనీ లో చేసినా అతను బయిట బ్యానర్స్ కి ఆమెను పరిచయం చేయటం కానీ ...రికమండేషన్స్ వంటివి కానీ చెయ్యలేదుట. అదే సల్మాన్ అయితే అప్పుడే ఆమెకు ముంబయి రిసార్ట్స్ అన్నీ చూపెట్టేసి,తన నిర్మాతలుకు ఆమెను పరిచయం చేసేస్తూ బిజీగా ఉన్నాడుట. ఏదైనా అసిన్ లక్కీనే అంటున్నారు. ఎందుకంటే సల్మాన్ తో తిరిగిన వారందరూ మంచి లైఫ్ లలో సెటిలయ్యారు కాబట్టిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X