నా లవవ్ కే లైన్ వేస్తావా..హీరో
తన లవర్ వంక ఎవరు కన్నెత్తి చూసినా ఒప్పుకోడని, నానా గొడవ చేస్తాడని సల్మాన్ ఖాన్ కి పేరుంది. దాంతో ఎవరూ అతని లవర్స్ జోలికి పోరు. అయితే తాజాగా మరో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ కాస్త ధైర్యం చేసి సల్మాన్ లవర్ కత్రినాతో చనువుగా ఉండటం ప్రారంభించాడు. న్యూయార్క్ సినిమా షూటింగ్ లో ఇది జరిగింది. ఇది వేరేవారి ద్వారా తెలుసుకున్న సల్మాన్ రెచ్చిపోయాడు. వెంటనే కత్రినాని కలిసి నిలదీసాడు. అంతేగాక ఆమె సెల్ నుంచి వెంటనే నీల్ కి ఫోన్ చేసాడు.
నీల్ నితిన్ ముఖేశ్..కత్రినా నుంచి ఫోన్ రావటం చూసి ఆనందంతో ఎగిరి గంతేసి మాట్లాడటం ప్రారంభించాడు. అయితే అటు ఉన్నది సల్మాన్ ఖాన్ అని తెలియకపోవటంతో కాస్త ఫోన్ రొమాన్స్ చేయబోయాడు. అది విన్న సల్మాన్ బి.పి రైజ్ అయింది. అసలే కోతి, ఆపై కల్లు త్రాగింది అన్నట్లు ఫోన్ లో బూతులు అందుకున్నాడు. మొదట అర్ధం కాకపోయినా తర్వాత అర్ధం చేసుకున్న నీల్ ఫోన్ పెట్టేసాడు. కానీ మళ్ళీ ఫోన్ చేసి తలవాచేలా తిట్టాడు. కాబట్టి కత్రినా కాస్త చనువిచ్చింది కదా అని రెచ్చిపోతే తర్వాత ఇలాగే ఉంటుందని బాలీవుడ్ వాసులు కామెంట్స్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











