సల్మాన్ వదిన డాన్స్, మెరిసిన అర్పిత (ఫోటోస్)
హైదరాబాద్: సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహ వేడుక మంగళవారం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా మొదలైంది. వివాహ వేడుకకు ముందు మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరిగాయి. మెహందీ కార్యక్రమంలో సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ అదంగా మెరిసి పోయింది.
ఇక సల్మాన్ ఖాన్ వదిన మలైకా అరోరా ఖాన్ వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుకలో డాన్స్ చేసారు. మలైకాతో పాటు సల్మాన్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు కూడా స్టెప్పులేయడంతో వివాహ వేడుక మరింత జోష్‌గా సాగింది. అందరూ సినీ స్టార్సే కావడంతో వేడక మరింత కలర్ ఫుల్‌గా మారింది.
ఇందుక సంబందించిన ఫోటోలు స్లైడ్ షోలో....

అర్పితా ఖాన్
వివాహ వేడుక సందర్భంగా చేతులకు మెహందీ పెట్టుకున్న అర్పితా ఖాన్ ఇలా ప్రత్యేక వస్త్రధారణలో అందంగా మెరిసి పోయింది.

మలైకా డాన్స్
అర్పితా ఖాన్ వివాహ వేడుకలో డన్స్ చేస్తున్న చేస్తతున్న మలైకా అరోరా ఖాన్.

హాట్ బ్యూటీ
బాలీవుడ్ ఐటం గర్ల్ గా ఇప్పటికే హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న మలైకా....ఈ వేడుకలో కూడా తన పెర్ఫార్మెన్సుతో అదరగొట్టనుంది. ఆమెతో పాటు సల్మాన్, ఆయన సోదరులు సొహైల్, అర్భాజ్ ఖాన్ కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

వరుడు ఆయుష్ శర్మ
వరుడు ఆయుష్ శర్మ శంషా బాద్ విమానాశ్రయంలో ఇలా కెమెరాకు చిక్కాడు. గత కొంతకాలంగా ఆయుష్, అర్పితా ప్రేమించుకుంటున్నారు.

చిరిగిన ప్యాషన్
చిరిగిన జీన్స్ వేసుకోవడం ఇపుడో ఫ్యాషన్. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మలైకా అరోరా ఖాన్ ఇలా....

సలీమ్ ఖాన్
సల్మాన్ తండ్రి సలీమ్ కాన్, ఆయన సోదరుడు సొహైల్ ఖాన్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇలా...

సల్మాన్ కుటుంబ సభ్యులు
శంషాబాద్ విమానాశ్రయంలో సల్మాన్ కుటుంబ సభ్యులు ఇలా....


Click it and Unblock the Notifications











