అల్లు అర్జున్ చిత్రం రీమేక్ లో సల్మాన్
సౌత్ లో ముఖ్యంగా తెలుగులో హిట్టైన చిత్రాల రీమేక్ లలో నటిస్తూ విజయం సాధిస్తున్న సల్మాన్ ఖాన్ త్వరలో ఆర్య 2 లో నటించబోతున్నట్లు సమాచారం.ఆర్య 2 చిత్రాన్ని యు టీవి వారు కొనుగోలు చేసారు.అందులో అల్లు అర్జున్ పాత్రకు గానూ సల్మాన్ ఖాన్ ని అడగటం జరిగింది.అయితే సల్మాన్ పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా చేయటానికి ఆసక్తి చూపించాడని తెలుస్తోంది.
ఆర్య 2 లో బాగా హిట్టైన రింగా రింగ పాటలో గతంలో రెడీ చిత్రంలో నర్తించిన సల్మాన్ కు ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రపై బాగానే ఆసక్తి ఉన్నట్లు సమాచారం.ఇక సల్మాన్ ఓకే అంటే మిగతా పాత్రల ఎంపిక మొదలవుతుందని బాలీవుడ్ పత్రికల కథనం.అయితే దర్శకుడు సుకుమార్ ఉంటాడా మరొకరు డైరక్ట్ చేస్తారా అనేది మాత్రం ఇంకా తేలలేదు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దబాంగ్ 2 ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.అలాగే కిక్ చిత్రం రీమేక్ లోనూ చేయనున్నారు.
మరో ప్రక్క అల్లు అర్జున్ తను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.సుకుమార్ మాత్రం మహేష్ కోసం స్క్ర్రిప్టుని పూర్తిగా వండే పనిలో ఉన్నారు.ఇక ప్రాజెక్టు ఓకే అయినా మెటిరియలైజ్ అవ్వటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.తెలుగులో చేసిన కాజల్ నే హిందీలోనూ తీసుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.ఆమె ఇప్పటికే అజయ్ దేవగన్ తో సింగం రీమేక్ లో చేసింది.నవదీప్ పాత్రను మాత్రం సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ఓ ఆప్షన్ గా పెట్టుకున్నారని,అందులో వచ్చే ఐటం సాంగ్ కి ఎలాగూ మలైకా ఆరోరా ఉండనే ఉందని బాలీవుడ్ లో వినపిస్తోంది.


Click it and Unblock the Notifications











