కలెక్షన్లో తిరుగులేని మెగాస్టార్..తనకు తానే రికార్డ్ బ్రేక్
ఏమైనా సల్మాన్ సల్మానే అనిపించాడు. బాలీవుడ్ లో తనకిక తిరుగులేదనిపించాడు. మొన్న రిలీజ్ అయిన సల్మాన్ చిత్రం 'బాడీగార్డ్' ఒక్క తొలిరోజునే ఇరవైకోట్లు వసూలు చేసి, రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందు అమీర్ నటించిన 'త్రీ ఈడియేట్స్' తొలిరోజు 13.5 కోట్లు వసూలు చేయగా, ఆ రికార్డుని గతేడాది వచ్చిన సల్మాన్ చిత్రం 'దబాంగ్' 14.5 కోట్ల తొలిరోజు కలక్షన్లతో అధిగమించింది.
ఇప్పుడు 'బాడీగార్డ్' తో తన రికార్డుని తానే తుడిచేశాడు. మీడియాలో వస్తున్న రివ్యూస్ ఎలా ఉన్నప్పటికీ, సినిమా కమర్షియల్ గా మంచి హిట్టేనని బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రిలీజయిన అన్ని సెంటర్ల నుంచీ మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. బాలీవుడ్ హయ్యస్ట్ గ్రాస్ కలక్షన్లలో ఇదొక సంచలనం సృష్టిస్తుందని సినీ వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విజయంతో సల్మాన్ రేంజ్ మరింత పెరిగిందనే చెప్పాలి..!
salman khan kareena kapoor body guard dabangg 3 idiots సల్మాన్ ఖాన్ కరీనా కపూర్ బాడీగార్డ్ దబాంగ్ త్రీ ఇడియట్స్


Click it and Unblock the Notifications