రివ్యూలు నెగెటివ్ అయినా బాక్సాఫీస్ వద్ద బాడీగార్డ్ వీరంగం...
సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా సిద్దిఖ్ రూపొందించిన బాలీవుడ్ చిత్రం బాడీగార్డ్ కు రివ్యూలు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ కలెక్షన్లు మాత్రం బాక్సాఫీస్ వద్ద గలగలా రాలుతున్నాయి. రంజాన్ పండుత రోజు విడుదలైన ఈ చిత్రం తొలి ఐదు రోజుల్లోనే దాదాపు 89 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి సరికొత్త రికార్డుల్ని సృష్టించింది.
తొలిరోజే రూ.21.60కోట్లని వసూలు చేసిన ఈ చిత్రం మిగతా నాలుగు రోజుల్లో వరుసగా రూ. 19.50కోట్లు, 14.08కోట్లు, 15.07 కోట్లు, 18.68కోట్లు, వెరసి మొత్తం రూ. 88.93కోట్లని వసూలు చేసిందని బాలీవుడ్ మీడియా అంటోంది. ఇదే రీతిలో కలెక్షన్లు కొనసాగితే సల్మాన్ ఖాన్ మునుపటి టాప్ గ్రాసర్ 'దబాంగ్"ని సులువుగా అధిగమించేస్తుందని అంచనా..! హిందీలోనూ బాడీగార్డ్ హిట్ కావటంతో త్రిష, వెంకీ జంటగా నటిస్తోన్న తెలుగు బాడీగార్డ్ ఏం చేస్తాడోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
More from Filmibeat
salman khan kareena kapoor bodyguard trisha venkatesh సల్మాన్ ఖాన్ కరీనా కపూర్ బాడీగార్డ్ త్రిష వెంకటేష్


Click it and Unblock the Notifications











