పెళ్ళిలో డాన్స్‌కు 3.5కోట్లు వసూలు చేసిన హీరో
డిల్లీ : స్టార్ హీరోలు తమ ముంగిట్లో ఆట,పాటలతో డాన్స్ లతో మురిపిస్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా రెడీ అయ్యి జనం ఈ దేశంలో ఉన్నారు. తాజాగా దేశరాజధాని నగరంలో గురువారంరాత్రి ఒక ప్రముఖ కుటుంబంలో జరిగిన పెళ్ళిలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ నృత్యం చేశారు. దీనికిగానూ ఆయన రు. 3.5 కోట్లరూపాయలను పుచ్చుకున్నారు.
ఇక ఆ వివాహం జరిగిన తీరు చూస్తే బాలీవుడ్ పెళ్ళిళ్ళు ఎందుకూ పనికిరావనిపిస్తుంది. పెళ్ళిలో ఆడిన తంబోలా ఆటలో విజేతలకు లగ్జరీ కార్లు, ప్యారిస్ వెళ్ళిరావడానికి విమాన టికెట్‌లు బహుమతులుగా ఇచ్చారు. తన ఛారిటబుల్ ట్రస్ట్ బీయింగ్ హ్యూమన్ నిర్వహించే గ్రామీణ యువజన సాధికారత కార్యక్రమానికి ప్రచారం చేయడంకోసం ఢిల్లీ వెళ్ళిన సల్మాన్ పనిలో పనిగా ఈ పెళ్ళిలో నృత్యానికికూడా ఒప్పుకున్నారు.
గ్రామీణులు, విద్యావంతులు, సరైన ఉద్యోగాలు లభించనివారికి సాధికారికత కల్పించడంకోసం బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్, హిందూస్తాన్ కోకో కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి కెరీర్ డెవలెప్‌మెంట్ సెంటర్ అనే సంస్థను ప్రారంభించాయి. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒదిషా రాష్ట్రాలలో తన కార్యకలాపాలను నిర్వహించనుంది.


Click it and Unblock the Notifications












