పాకిస్థాన్ భామపై కన్నేసిన సల్మాన్
కొత్త హీరోయిన్లకు అవకాశం ఇవ్వడంలోనూ, తన స్టార్ ఇమేజ్ ఉపయోగించి వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయడంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముందుంటారు. తన ద్వారా ఓ హీరోయిన్ పరిశ్రమలో పైకొచ్చింది అని పొగిడించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. అందుకే చాలా మంది హీరోయిన్లు సల్మాన్ తో నటించాలని పోటీ పడుతుంటారు. ఆ రకంగా కండల వీరుడి ద్వారా లబ్ది పొందిన హీరోయిన్ల చాలా మందే ఉన్నారు. సరైన నటనా నైపుణ్యం లేదని కెరీర్ తొలి నాళ్లలో విమర్శలు ఎదుర్కొన్న కత్రినాకు..సల్మాన్ సిఫారసుల వల్లనే చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పడు తిరుగులేని భామగా ఎదిగింది. దక్షిణాది తార ఆసిన్ కూ బాలీవుడులో రాణించడం వెనక కూడా సల్లూబాయ్ హస్తం ఉంది.
తాజాగా మరో భామపై సల్మాన్ కన్ను పడింది. ఆమె పేరు నర్గిస్ ఫక్రి. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన 'రాక్ స్టార్" చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె తెలిసినిమా. ఇప్పటికే విడుదలైన ఆమె ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు నర్గిస్ ను తమ సినిమాల్లో బుక్ చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. ఈ వరుసలో అందరికంటే ముందు ఉన్నాడు సల్మాన్. తన తమ్ముడు సొహైల్ ఖాన్ దర్శకత్వంలో తాను చేయబోయే 'షేర్ ఖాన్" చిత్రంలో నర్గిస్‌ను కథానాయికగా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చాలా మంది తారలు ఈ సినిమాలో నటించడానికి పోటీ పడుతున్నా..వారందరినీ కాదని సల్మాన్ నర్గిస్ నే కావాలని కోరుకుంటుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











