»   » సల్మాన్ కోసం రామ్ చరణ్ ఏంచేస్తున్నాడో తెలుసా?

సల్మాన్ కోసం రామ్ చరణ్ ఏంచేస్తున్నాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జంజీర్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ షూటింగ్ జరిగిపుడు ఆ మధ్య కొంతకాలం ముంబైలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. చరణ్‌కు ముంబై నగరం, బాలీవుడ్ ఇండస్ట్రీ కొత్త కావడంతో దగ్గరుండి అన్నీ చూసుకోవడంతో పాటు స్పెషల్ కేర్ తీసుకున్నాడు సల్మాన్.

ప్రస్తుతం సల్మాన్ తన తాజా సినిమా 'మెంటల్' చిత్రీకరణలో భాగంగా కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. దీంతో రామ్ చరణ్ సల్మాన్‌ను వీలైనప్పుడు కలవడంతో పాటు, ప్రతి రోజూ తన ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నాడట.

సల్మాన్‌కు హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టం. బిర్యానీతో పాటు పలురకాల రుచికరమైన వంటలు సల్మాన్ ఖాన్ కోసం రోజు వండి తీసుకెల్తున్నారట. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం. సల్మాన్‌తో స్నేహం చేసిన వారంతా బాలీవుడ్లో టాప్ పొజిషన్‌కు ఎదిగారు. మరి రామ్ చరణ్ కూడా అదే స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.

సల్మాన్ నటిస్తున్న మెంటల్ సినిమా విషయానికొస్తే....మెగాస్టార్ చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రానికి రీమేక్‌గా సల్మాన్ హీరోగా బాలీవుడ్‌లో 'మెంటల్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో హీరోయిన్లుగా సనాఖాన్, డైసీ షా ఎంపికయ్యారు.

English summary
According to unit sources Salman gets special home cooked Biryani from Ram Charan’s home everyday. Salman is shooting in the Hyderabad city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu