twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాడీ గార్డ్ ని నమ్మిన సల్మాన్ !

    By B N Sharma
    |

    సినీ నటుడు సల్మాన్ ఖాన్ మొదటి నుండి వివాదాలకు పెట్టింది పేరు. అతని బాడీ గార్డు షేరా, సల్మాన్ నటించిన, త్వరలో విడుదల కానున్న 'బాడీ గార్డ్" సినిమాకు రివ్యూ రాశాడు. దీనితో సల్మాన్ కు అతనిపై భయం పట్టుకుంది. కారణం. తన జీవితమంతా వివాదాలే.

    ఏనాటికైనా తనపై తన బాడీ గార్డ్ షేరా ఒక పుస్తకం రాస్తే తనపని ఖాళీ అంటాడు సల్మాన్. అవును మరి, సల్మాన్ అఘాయిత్యాలు ఒకటా ! రెండా !! లేక్కకు లేనన్ని, మచ్చుకు చెప్పాలంటే - మీడియా వ్యక్తులను ఉతికి ఆరేయటం, అండర్ వరల్డ్ లింకులు, తన గాళ్ ఫ్రెండ్స్ సోమీ అలి నుండి ఐశ్వర్య రాయ్ వరకు గల విభేధాలు, కీచులాటలు, చింకారా పోచింగ్ కేసు లాంటివి ఎన్నో వున్నాయి.

    అయితే, గత 15 ఏళ్ళుగా తనకు బాడీగార్డ్ గా వున్న షేరా తనపై అన్నీ రాసి తనజీవిత చరిత్ర పాడు చేయడని, అతనో మంచి నమ్మకస్తుడని 45 ఏళ్ళ సల్మాన్ గాఢంగా నమ్ముతున్నాడు. తన కుటుంబ వ్యవహారాలైనా, సొమ్ము వ్యవహారాలైనా, లేదా తాను మద్యం తీసుకున్నపుడు, తీసుకోనపుడు, లేదా తన జీవితంలో అందరి మహిళల విషయంలో సైతం షేరా నమ్మకస్తుడే నంటాడు. తన బాడీగార్డ్ తన జీవితంలోకి వచ్చిన చాలామంది మహిళలకు గతంలో బాడీ గార్డుగా కూడా ఉన్నాడని సల్మాన్ చెపుతాడు.

    మాజీ అందాల రాణి ఐశ్వర్య తనను అనేక హింసలు పెట్టాడని సల్మాన్ పై ఒకప్పుడు ఫిర్యాదులు చేసింది. 2002 లో తనతో విడిపోయిన తర్వాత మరవ లేక తన వెంట పడి అల్లర్లు చేశాడని కూడా అంది. ఆమె తల్లితండ్రులు అతనిపై పోలీస్ కంప్లెయింట్లు కూడా ఇచ్చారు. సల్మాన్ తన కారును ర్యాష్ గా డ్రైవ్ చేసి ముంబైలోని ఒక బేకరీని ధ్వంసం చేసి, పేవ్ మెంట్ పై నిద్రిస్తున్న ఒక వ్యక్తి మరణానికి, ముగ్గురు గాయపడి ఆస్పత్రి పాలవ్వటానికి కూడా కారకుడయ్యాడు.1998 లో రాజస్తాన్లోని జోధ్ పూర్లో ఒక జింకను వేటాడి చంపినందుకు గాను 2006లో సల్మాన్ ఒక సంవత్సరంపాటు జైలు పాలు కూడా అయ్యాడు. ఇంతకీ బాడీగార్డు షేరా సల్మాన్ విషయంలో చివరకు ఏం చేస్తాడో వేచి చూద్దాం !

    English summary
    Controversies have always dogged Salman with the actor being in news for wrong reasons - be it for roughing up media -persons, his alleged underworld links, his aggressive behaviour with his actress girl friends from Sony Ali to Aishwarya Rai, involvement in a hit-and-run and the Chinkara poaching case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X