Just In
- 40 min ago
చంద్రబాబు, లోకేష్, జగన్ అందరినీ వాడుకుంటున్న వర్మ! ఫొటోలతో దుమారం.. ఇదీ పరిస్థితి
- 12 hrs ago
నాని పని అయిపోయిందా..? వైరల్‌గా మారిన పోస్ట్
- 12 hrs ago
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- 13 hrs ago
మహేష్ ముచ్చట్లకు విజయశాంతి ఆశ్చర్యం.. సూర్యుడివో చంద్రుడివో అంటూ హల్చల్
Don't Miss!
- News
అనాజ్ మండిలో మరోసారి అగ్నిప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు: స్థానికుల్లో ఆందోళన..!
- Finance
అంతా ప్రధాని కార్యాలయం నుంచే, మంత్రులు డమ్మీలు: రఘురాం రాజన్ తీవ్ర విమర్శలు
- Technology
అన్లిమిటెడ్ కాల్‌లను మళ్ళి మొదలు పెట్టిన ఎయిర్టెల్
- Sports
రెండో టీ20లో టీమిండియా ఓటమి: రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ
- Lifestyle
సోమవారం మీ రాశిఫలాలు 9-12-2019
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సినిమా చూసి ఎంజాయ్ టీమ్ ఇండియా ఆటగాళ్లు.. స్టార్ హీరో కామెంట్స్
భారత క్రికెట్ జట్టు ప్లేయర్స్ భారత్ సినిమా చూసి తమ స్పందన తెలిపారు. ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొంటున్న భారత ఆటగాళ్లు తమ ఖాళీ సమయంలో సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీ చూసి ఎంజాయ్ చేశారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఆల్ రౌండర్ కేదార్ జాదవ్. ఇది చూసిన సల్మాన్ ఎలా రియాక్ట్ అయ్యాడంటే..

రెండు విజయాలు.. ఫుల్ జోష్
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత క్రికెట్ జట్టు మంచి ప్రతిభ కనబరుస్తోంది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే భారత జట్టు ఖాతాలో రెండు విజయాలు చేరాయి. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న టీమ్ ఇండియా ఆటగాళ్లు తదుపరి ఆట కోసం కసరత్తులు చేస్తూనే విరామ సమయంలో సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాస్త రిలాక్స్ కోసం భారత్ సినిమా చూశారు టీమ్ ఇండియా ప్లేయర్స్.
|
ఇంగ్లాండ్ లోని నాట్టింగ్ హామ్ లో
వరుస విజయాలతో ఉరకలేసే ఉత్సాహంగా ఉన్న టీమ్ ఇండియా ప్లేయర్స్ ఇంగ్లాండ్ లోని నాట్టింగ్ హామ్ లో 'భారత్' సినిమా వీక్షించారు. ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ సహా ఇతర ఆటగాళ్లంతా కలిసి సినిమాను ఎంజాయ్ చేశారు. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
|
కేదార్ జాదవ్ ట్వీట్.. సల్మాన్ రియాక్షన్
తామంతా కలిసి 'భారత్' సినిమా చూశామని టీమ్ ఇండియా ఆటగాడు కేదార్ జాదవ్ ట్వీట్ చేశాడు. ఈ మేరకు 'భారత్ మూవీ చూసిన తర్వాత భారత జట్టుతో' అంటూ ట్యాగ్ చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు థియేటర్ లో ఆటగాళ్లందరూ కలిసి దిగిన పిక్ కూడా షేర్ చేసి తన ఆనందాన్ని వెలిబుచ్చాడు. దీంతో ఈ చూసిన సల్మాన్ 'భారత్ చిత్రాన్ని చూసినందుకు.. థాంక్యూ భారత్ టీం.. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మ్యాచెస్' అని రిప్లై పెట్టాడు. దేశం మొత్తం మీ వెన్నంటి ఉంది అని సల్మాన్ తన ట్వీట్ లో పేర్కొనడం విశేషం.

భారత్ మూవీ.. సల్మాన్, కత్రినా హంగామా
అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా రూపొందింది 'భారత్' మూవీ. ఈ సినిమాలో దిశా పటాని ముఖ్య పాత్ర పోషించింది. జూన్ 5 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ రాబడుతోంది. చిత్రంలో సల్మాన్, కత్రినా హంగామా హైలైట్ అవుతోంది. సల్మాన్ కెరీర్ లోనే ఈ సినిమా ఓ మైలురాయి అని పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు.