సినిమా పుణ్యమా అని విడిపోయిన ఆ సినీ జంట ఒకటవుతోంది
కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ మధ్య విబేధాలు వచ్చి విడిపోయిన సంగతి తెలిసిందే.విడిపోయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఏ ప్రాజెక్టూ ఒప్పుకోలేదు.అయితే తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్నారనే వార్త వచ్చింది.'న్యూయార్క్' సినిమా డైరక్టర్ హెల్మర్ కబీర్‌ఖాన్ నిర్మించబోయే తదుపరి చిత్రంలో వీరిద్దరూ జతకట్టనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు స్క్రిప్టు కూడా రెడీ అయిందని చెప్తున్నారు. ఎప్పుడూ స్టోరీలో వేళ్ళు కాళ్ళూ అడ్డంగా దూర్చేసి మార్పులు చేసే సల్మాన్ ఖాన్ ఈ సారి వెంటనే ఓకే చేసేసాడు.
ఇక ఈ చిత్రంలో మొదట సల్మాన్ సరసన ప్రియాంక చోప్రా గానీ, దీపికా పదుకొణె గానీ అనుకున్నారు.కానీ సల్మాన్, కత్రినా జోడీ బాగుంటుందని దర్శకుడు పట్టుబట్టి ఒప్పించాడట.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండుతుందని ఆయన భావించడంతో సల్మాన్ కూడా ఓకే చేసేసాడు.ఇందుకు కత్రినా కూడా సై అనడంతో ఇప్పటి వరకు ఎడ మొహం... పెడ మొహంగా ఉన్నా వీరిద్దరూ... ఈ సినిమాతో మళ్లీ ఒక్కటవుతున్నారు.అదీ సంగతి.


Click it and Unblock the Notifications











