»   » సల్మాన్ లగ్జరీ లైఫ్‌: ఎంజాయ్మెంటు కోసం 100 ఎకరాల్లో ఇల్లు!

సల్మాన్ లగ్జరీ లైఫ్‌: ఎంజాయ్మెంటు కోసం 100 ఎకరాల్లో ఇల్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్ ఖాన్... బాలీవుడ్లో నెం.1 హీరో. ఆయన సినిమా విడుదలైతే సినిమా థియేటర్లన్నీ హౌస్ ఫుల్... వందల కోట్ల కలెక్షన్. ఒకప్పుడు సినిమాలకు సాధారణ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుండి లాభాల్లో వాటా తీసుకునే స్థాయికి సల్మాన్ ఖాన్ ఎదిగాడు. ఒక సినిమా హిట్టయి భారీ కలెక్షన్లు సాధిస్తే లాభాల్లో దాదాపు సగం సల్మాన్ ఖాన్‌కే చెందుతాయని టాక్.

దీంతో పాటు సల్మాన్ ఖాన్‌కు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. అవే కాక టీవీ షోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ఇలా వివిధ రూపాల్లో సల్మాన్ సంపాదన సంవత్సరానికి వేల కోట్ల స్థాయిలో ఉంటుందని అంటుంటారు. మరి అలాంటి సల్మాన్ ఖాన్ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

కొందరు బడా స్టార్లు, డబ్బున్న వ్యక్తుల వ్యవహారాలు వివాదాస్పదంగా ఉన్నట్లే సల్మాన్ ఖాన్ జీవితంలో కూడా అనే వివాదాలు...కోర్టు కేసులు. ఇక పలు సందర్భాల్లో సల్మాన్ నోటి దూల కారణంగా వివాదంలో పడ్డ సందర్బాల్లో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు ఇటీవల 'సుల్తాన్' రేప్ కామెంట్సే ఉదాహరణ.

ఇలా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉండే సల్మాన్ ఖాన్ తాజాగా తాను నిర్మించుకుంటున్న హాలిడే హోం అంశంతో నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. 100 ఎకరాల విస్తీర్ణంలో సల్మాన్ ఖాన్ హాలిడే హోం నిర్మించుకుంటున్నాడట. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు..

ఎక్కడ నిర్మిస్తున్నాడు?

ఎక్కడ నిర్మిస్తున్నాడు?

100 ఎకరాల విస్తీర్ణంలో గొరాయ్‌ బీచ్‌ సమీపంలో ఆయన ఐదు బెడ్‌ రూంల బంగ్లా కట్టించుకుంటున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

అక్కడే వేడుక

అక్కడే వేడుక

తన 51వ పుట్టినరోజుని ఇదే బంగ్లాలో జరుపుకోవాలనుకుంటున్నాడట. అంతేకాదు.. ఇంటినే కాకుండా ఇంటి ఆవరణనీ తనకు నచ్చినట్లుగా డిజైన్‌ చేయించుకుంటున్నాడు.

అంతే కాదు...

అంతే కాదు...

కేవలం ఇల్లే కాదు ఇంటివెనుక భాగంలో డర్ట్‌ బైకింగ్‌ ఎరీనా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు.

ఫ్యామిలీ కోసం, గెస్ట్ ల కోసం..

ఫ్యామిలీ కోసం, గెస్ట్ ల కోసం..

ఇదే ఎస్టేట్‌లో తన కుటుంబీకులు, అతిథుల కోసం మరో రెండు బంగ్లాలు కట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

ఫౌంహౌస్‌లు

ఫౌంహౌస్‌లు

అంతేకాదు మహారాష్ట్ర ఈశాన్య ప్రాంతంలో పలు ఫామ్‌హౌస్‌లు కూడా ఏర్పాటుచేసుకోవాలనుకుంటున్నాడు సల్మాన్‌.

English summary
According to the latest buzz, Salman Khan is building himself a 100-acre holiday home at Gorai beach. Bhai is currently constructing a plush 5-BHK on the property with plans to make the sea-facing, picturesque bungalow his annual holiday home.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu