రెండు హిట్లు ఇచ్చా, నన్ను కాదని బాధపెట్టాడు.... దర్శకుడిపై సల్మాన్ సంచలనం!

By Bojja Kumar

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావతి' మూవీ పలు వివాదాల కారణంగా ఈ రోజు విడుదల ఆగిపోయింది. ఈ వివాదంపై స్పందించాలని బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్‌ను కోరగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సల్మాన్, భన్సాలీ మధ్య విబేధాలు ఉన్నట్లు అప్పట్లో వార్లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ స్పందించిన తీరు అప్పటి వివాదాన్ని మరోసారి గుర్తు చేసింది.

ఇతరుల సంగతేమో? నేను మాత్రం ఆయన వల్ల బాధపడ్డాను

ఇతరుల సంగతేమో? నేను మాత్రం ఆయన వల్ల బాధపడ్డాను

‘పద్మావతి' సినిమా చాలా మందిని బాధ పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి, దీనిపై మీ స్పందన ఏమిటి? అనే ప్రశ్నకు సల్మాన్‌ ఖాన్ సమాధానం ఇస్తూ, ‘ఆ వివాదం గురించి సెన్సార్‌ బోర్డు, సుప్రీం కోర్టు చూసుకుంటాయి. ఆయన వల్ల ఎవరు బాధపడ్డారో నాకు తెలియదు. నేను మాత్రం ఆయన వల్ల చాలా బాధపడ్డాను.... అంటూ సల్మాన్ అన్నారు.

రెండు హిట్స్ ఇచ్చా, అయినా కాదన్నాడు

రెండు హిట్స్ ఇచ్చా, అయినా కాదన్నాడు

నేను ఆయనకు రెండు సూపర్‌ హిట్స్‌ ఇచ్చాను. కానీ ఆయన తన తర్వాతి సినిమా దేవదాస్‌కి నన్ను కాదని షారుక్‌ ఖాన్‌ ని తీసుకున్నారు. ఆ విషయంలో నేను చాలా బాధ పడ్డాను' అని తన మనసులోని మాటను సల్మాన్ ఖాన్ బయట పెట్టారు.

సల్మాన్, భన్సాలీ హిట్స్ ఇవే

సల్మాన్, భన్సాలీ హిట్స్ ఇవే

సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లో ‘ఖామోషీ', ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌' సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఈ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీని తర్వాత భన్సాలీ ‘దేవదాస్' అనే సినిమా చేశారు. అయితే ఇందులో సల్మాన్ ను కాదని, షారుక్ ను తీసుకున్నారు.

అప్పట్లో భన్సాలీ ‘దేవదాస్’ వివాదంపై ఏమన్నారంటే...

అప్పట్లో భన్సాలీ ‘దేవదాస్’ వివాదంపై ఏమన్నారంటే...

అప్పట్లో ‘దేవదాస్' వివాదంపై భన్సాలీ స్పందిస్తూ.... సల్మాన్ నా నుండి ఆ సినిమా ఆశించాడు కాబట్టి బాధ పడ్డాడు. కానీ దర్శకుడిగా నాకు నచ్చింది చేయడం ఎంతో ముఖ్యం. ఓ నటుడిగా అతడ్ని నేను ఎప్పుడూ తక్కువ చేయలేదు. నా సినిమాకు తగిన నటుడిని నేను ఎంచుకున్నాను అని భన్సాలీ తెలిపారు.

డైరెక్టర్ గారికి చట్టం తెలియదా? ‘పద్మావతి’ వివాదంపై పార్లమెంటు ప్యానల్ ఫైర్, ఆగిన రిలీజ్!

డైరెక్టర్ గారికి చట్టం తెలియదా? ‘పద్మావతి’ వివాదంపై పార్లమెంటు ప్యానల్ ఫైర్, ఆగిన రిలీజ్!

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి' మూవీ గొడవ పార్లమెంటు వరకు వెళ్లింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X