»   » అక్రమ ఆయుధాల కేసులో కూడా సల్మాన్ నిర్దోషే, జోధ్‌పూర్ కోర్టు తీర్పు!

అక్రమ ఆయుధాల కేసులో కూడా సల్మాన్ నిర్దోషే, జోధ్‌పూర్ కోర్టు తీర్పు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జోధ్‌పూర్(రాజస్థాన్): అక్రమ ఆయుధాలు వినియోగించిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు క్లీన్ చిట్ లభించింది. ఈ మేరకు జోధ్‌పూర్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని అభిప్రాయ పడిన కోర్టు... ఈ కేసులో అతన్ని నిర్దోషిగా తేల్చింది.

1998లో అక్టోబర్లో అనుమతి లేకుండా రైఫిల్, రివాల్వర్ కలిగి ఉండి... వన్య ప్రాణులను వేటాడిన సంఘటనలో సల్మాన్ ఖాన్ మీద మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటికే రెండు కేసుల్లో సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటపడగా... తాజాగా మూడో కేసు నుండి కూడా విముక్తి పొందాడు.

Salman Khan acquitted in 18 year old Arms Act case

అనుమతి లేకుండా అక్రమంగా ఆయుధాలను వినియోగించాడనే కేసులో తాజాగా జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులకు సంబంధించి ఏప్రిల్ 2006లో ఒకసారి, ఆగస్టు 2007లో ఒకసారి సల్మాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవించారు. తర్వాత బెయిల్ విడుదలయ్యాడు. సుధీర్ఘ కాలంగా ఈ కేసు విచారణ సాగుతోంది.

హిందీ మూవీ హమ్ సాత్ సాత్ హై... సినిమా షూటింగ్ రాజస్థాన్ లోని జోధ్ పూర్ సమీపంలోని కంకాని గ్రామ పరిసరాల్లో జరుగుతున్న సమయంలో అక్టోబర్ 1, 2 తేదీల మధ్య అర్ధరాత్రి సల్మాన్ ఖాన్ అక్రమంగా మారణాయుధాలను ఉపయోగించి కృష్ణ జింకలను వేటాడాడనే ఆరోపణలతో ఇంతకాలం ఈ కేసు విచారణ సాగింది. మొత్తానికి సల్మాన్ ఖాన్ నిర్దోషిగా తేలడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Jodhpur (Rajasthan), Jan 18: A Jodhpur court on Wednesday acquitted the Bollywood star Salman Khan in the Arms Act case. Meanwhile, fans have gathered outside the court to hear the verdict on the actor's impending Arms Act case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu