నెగిటివ్ ప్రచారం చేస్తే ఊరుకోను అంటూ స్టార్ హీరో వార్నింగ్
నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు దాని వల్ల మీకేంటి లాభం అంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ అని సల్మాన్ ఖాన్ మీడియాను నిలదీశాడు. ఆయన తాజా చిత్రం రెడీ గురించి మీడియాలో గత కొద్ది రోజులుగా రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం అనుకున్నంత బాగా రావటం లేదని, కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్లీ షూట్ చేసారని మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో ఇలా సల్మాన్ ఇలా ఘాటుగా స్పందించాడు. అలాగే..మా సినిమా ఇంకా విడుదల కాలేదు. అది చూడకుండా ఆ సీన్స్ బాగోలేదు..ఫలానా ఎపిసోడ్ బాగా రాలేదు అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు. బాగా రాలేదు అని ఎలా నిర్థారిస్తారు. టీ సిరీస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ సినిమా నిర్మిస్తోంది. నిర్మాణరంగంలో సంస్థకు ఎంతో అనుభవం ఉంది. సినిమాకు సంబంధించి హక్కులన్నీ ఎప్పుడో అమ్మేశాం. ఇలాంటి నెగిటివ్ టాక్ వల్ల మాకు నష్టం జరుగుతుంది. పంపిణీదారులు నష్టపోతారు. ఉన్నవీ లేనివీ కల్పించి రాయొద్దు. సినిమా చూశాక ఎవరేం మాట్లాడినా అర్థం ఉంటుంది అని అన్నాడు. సల్మాన్, ఆసిన్ జంటగా 'రెడీ' సినిమా రూపొందుతోంది. తెలుగులో శ్రీను వైట్ల దర్సకత్వంలో రూపొంది హిట్టయిన రెడీ చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











