twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌ను వెంటాడుతున్న కేసు: కోర్టు సమన్లు

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కోర్టు కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 4, 2013న అతన్ని కోర్టుకు హాజరు కవాల్సిందిగా ఆదేశించింది. సల్మాన్ తో పాటు ఈ సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రేలకు కూడా సమన్లు అందాయి. జింకను వేటాడిన కేసులో కోర్టు వారికి సమన్లు జారీ చేసింది.

    1999లో హమ్ సాథ్ సాథ్ హై సిన్మా షూటింగ్ కోసం.. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలీ బింద్రే రాజస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్ కి దగ్గర్లో ఓ జింక తూపాకీ తూటాలకు బలైంది. దీనికి కారణం సల్మాన్ అండ్ కో అనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సల్లూ భాయే జింకను కాల్చి చంపాడని అభియోగాలు నమోదయ్యాయి.

    నిందితులపై ఐపీసీ సెక్షన్ 149తో పాటు.. సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఏళ్ల తరబడి విచారణ కొనసాగింది. కేసుతో సంబంధం ఉన్న సల్మాన్ అండ్ కో దోషులుగా తేలితే- వాళ్లలో ముఖ్య నిందితుడైన సల్మాన్ కు మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే.. సల్మాన్ సిన్మా లైఫ్ కి ఇక బ్రేక పడినట్లే.

    English summary
    Salman Khan will have to appear in court in connection with 1998's Chinkara poaching case on February 4, 2013, a Jodhpur court has ruled. Actors Saif Ali Khan, Tabu, Sonali Bendre and Neelam have also been directed to appear.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X