సల్మాన్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనే (ఫోటో)
ముంబై: బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ విదేశీ వనితని పెళ్లాడనున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో రొమేనియన్ తార లులియా వాంటర్‌ని ఆయన వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకొంది. వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ఆ బంధం కలిసి జీవితాన్ని పంచుకొనే వరకు వెళ్లిందని తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్‌ఖాన్ చెప్పిన మాటలు ఈ ప్రచారానికి బలాన్నిచ్చేలా ఉన్నాయి. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీరు చూస్తున్న ఫోటోలో ఆమే.
సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ... ''పదిహేనేళ్ల వయసు నుంచి నా జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇప్పుడిప్పుడే మారుతున్నాననిపిస్తోంది. రెండున్నరేళ్లుగా జీవితంలో ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక నుంచి అలా ఉండదని నమ్ముతున్నా. ఎందుకంటే... నా జీవితంలో ఓ కీలక ఘట్టం జరగబోతోంది'' అన్నారు సల్మాన్‌ఖాన్.

తన కుటుంబం గురించి చెబుతూ ''మా నాన్న పఠాన్, అమ్మ హిందు, రెండో అమ్మ కేథలిక్. మా వదినేమో పంజాబీ. నాక్కాబోయే భార్య మాత్రం విదేశం నుంచి వస్తుందనుకొంటున్నా. నేను కులమతాలకు ప్రాధాన్యమివ్వను. మానవత్వానికే ప్రాధాన్యమిస్తా'' అని చెప్పుకొచ్చారు సల్మాన్‌ఖాన్. ఈ మాటల్ని గమనిస్తే రొమేనియాకి చెందిన లులియానే ఆయన వివాహం చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదివరకు పలువురు తారలతో బంధం కొనసాగించారు కదా? అని అడిగితే... ''వాళ్లు గొప్ప అమ్మాయిలు, నేను మాత్రం గొప్ప బాయ్‌ఫ్రెండ్‌ని కాలేకపోయాను. నేను స్నేహితుడిని మాత్రమే. ఆ విషయాన్ని నా మాజీ గాళ్‌ఫ్రెండ్స్ కూడా చెప్పార''ని వ్యాఖ్యానించారు. కష్టకాలంలో అండగా ఉన్న తల్లిదండ్రులకు కూడా సల్మాన్‌ఖాన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. ''అల్లరి చేయని పిల్లలంటూ ఎవ్వరూ ఉండరు. నేను కూడా చాలా తుంటరిపనులు చేశాను'' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











