హీరో సిద్ధార్థకు సల్మాన్ ఖాన్ పిలుపు
హైదరాబాద్: సౌత్ హీరో సిద్ధార్థ కేవలం సినిమా ప్రియుడే కాదు...క్రికెట్ లవర్ కూడా. తరచూ ఇంటర్నేషనల్ మ్యాచ్ లను ఫాలో అవుతూ ఉంటాడు. క్రికెట్ ఆడటంలో కూడా కాస్త బెటర్ అనే చెప్పొచ్చు. ఈనేపథ్యంలో సిద్ధార్థకు బాలీవుడ్ స్టార్, ముంబై హీరోస్ కెప్టెన్ సల్మాన్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది.
వచ్చే సంవత్సరం జరిగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్(ccl)లో తన జట్టు 'ముంబై హీరోస్' తరుపున ఆడాలని సిద్ధార్థను సల్మాన్ ఖాన్ అడిగాడట. ఏకంగా సల్మాన్ ఖాన్ నుంచి ఫోన్ రావడంతో ఉబ్బి తబ్బిబ్బయిన సిద్ధార్థ.....ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు వెల్లడించారు.
'సల్మాన్ భాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన సారథ్యంలోని ముంబై హీరోస్ టీం తరుపు వచ్చే సంవత్సరం జరుగబోయే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆడాలని కోరారు. ఆయన నుంచి పిలుపు రావడం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్, చెన్నయ్, ముంబై టీంలు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆడుతున్నాయి. ఈ మూడు బాషల ప్రేక్షకులకు నేను సుపరిచితున్ని...ఇట్ ఈ ఎ లవ్లీ ఫీలింగ్' అంటూ ట్వీట్ చేసాడే సిద్ధార్థ.
సిద్ధార్థ సినిమాల వివరాల్లోకి వెళితే...
సిద్దార్థ-సమంత జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి 'జబర్‌దస్త్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











