వెంకీ కూతురు పెళ్లి సందడి: సల్మాన్ ఖాన్, ప్రముఖుల హాజరు (ఫోటోస్)
టాలీవుడ్ స్టార్ వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి పెళ్లి సందడి మొదలైంది. రాజస్థాన్‌లోని జైపూర్లో ఈ పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెంకటేష్, సల్మాన్ ఖాన్ మధ్య చాలా ఏళ్ల నుంచి స్నేహం ఉంది. వెంకీ తండ్రి, ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు ఉన్నప్పటి నుంచే బాలీవుడ్ నటులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూతురు వివాహానికి వెంకటేష్ తనకు సన్నిహితంగా ఉండే పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించారు.

వెంకీ కూతురు పెళ్లి వేడుకలో సల్మాన్ ఖాన్
వెంకీ కూతురు పెళ్లి వేడుకకు హాజరైన సల్మాన్ ఖాన్.... వెంకటేష్, రానాతో కలిసి ఫోటో దిగారు. యాక్టర్, పొలిటీషియన్ బినా కాక్ ఈ పిక్చర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

కంగ్రాజ్యులేషన్స్ వెంకీ...
వెంకటేష్, సల్మాన్ ఖాన్‌తో కలిసి ఫోటో దిగిన బినా కాక్... కంగ్రాజ్యులేషన్స్ వెంకీ అంటూ విష్ చేశారు. ఇలా ప్రముఖులు పోస్ట్ చేసిన పిక్స్ తప్ప... పెళ్లి వేడుకకు సంబంధించిన వివరాలు, ఫోటోలు బయటకు రావడం లేదు.

ఆశ్రిత దగ్గుబాటి వివాహం
ఆశ్రిత దగ్గుబాటి తన బాయ్ ఫ్రెండ్ వినాయక్ రెడ్డిని పెళ్లాడుతున్నారు. వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లోని వెంకీ నివాసంలో ఫిబ్రవరిలో జరిగింది. ఆశ్రిత దగ్గుబాటి ప్రొఫెషనల్ బేకర్. ఇన్ఫినిటీ ప్లాట్టెర్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీని సైతం రన్ చేస్తున్నారు.

వినాయక్ రెడ్డి కుటుంబం
హీరో వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం చేసుకోబోయే వినాయక్ రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వినాయక్ తాత రామసహాయం సురేందర్ రెడ్డి పలుమార్లు వరంగల్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

పెళ్లి వేడుకలో రానా, చైతు, సమంత సందడి
ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పాల్గొనడానికి రానా దగ్గుబాటి, నాగచైతన్య, సమంత అక్కినేని ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. ఈ వేడుకలో వీరు తమ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారని తెలుస్తోంది. అయితే ఇంకా ఈ ఫోటోస్ ఏవీ కూడా బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications











