‘ఎవడు’ సెట్లో సల్మాన్ ఖాన్ సందడి
హైదరాబాద్ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' షూటింగ్ సెట్లో సందడి చేసాడు. ప్రస్తుతం తను నటిస్తున్న 'మెంటల్' చిత్రం షూటింగులో భాగంగా హైదరాబాద్ లోనే ఉన్న సల్మాన్ 'ఎవడు' షూటింగ్ సెట్ ను సందర్శించాడు.
జంజీర్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ షూటింగ్ జరిగిపుడు ఆ మధ్య కొంతకాలం ముంబైలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. చరణ్‌కు ముంబై నగరం, బాలీవుడ్ ఇండస్ట్రీ కొత్త కావడంతో దగ్గరుండి అన్నీ చూసుకోవడంతో పాటు స్పెషల్ కేర్ తీసుకున్నాడు సల్మాన్. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
ప్రస్తుతం 'మెంటల్' చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దీంతో రామ్ చరణ్ సల్మాన్‌ను వీలైనప్పుడు కలవడంతో పాటు, ప్రతి రోజూ తన ఇంటి నుంచి భోజనం ఆయన కోసం పంపిస్తున్నాడట. సల్మాన్‌కు హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టం. బిర్యానీతో పాటు పలురకాల రుచికరమైన వంటలు సల్మాన్ ఖాన్ కోసం రోజు వండి తీసుకెల్తున్నారట. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం.
సల్మాన్ నటిస్తున్న మెంటల్ సినిమా విషయానికొస్తే....మెగాస్టార్ చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రానికి రీమేక్‌గా సల్మాన్ హీరోగా బాలీవుడ్‌లో 'మెంటల్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో హీరోయిన్లుగా సనాఖాన్, డైసీ చేస్తున్నారు.
ఎవడు సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. అల్లు అర్జున్, కాజల్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. జులై చివరి వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications












