»   » మళ్ళీ భారతీయ హీరో పై విషం చిమ్మిన పాక్ నటి

మళ్ళీ భారతీయ హీరో పై విషం చిమ్మిన పాక్ నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత్-పాకిస్థాన్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అటు బార్డర్లో ఎప్పుడు చూసిన ఉద్రిక్త పరిస్థితి...రాజకీయంగా ఎన్నో వివాదాలు. అయితే సినిమా రంగానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పలువురు పాకిస్తాన్ స్టార్స్ బాలీవుడ్లో పాగా వేయడానికి క్యూ కడుతున్నారు. ఇక్కడ ఉండే అవకాశాలూ, భారీ రెమ్యున రేషన్లూ వాళ్ళని ఇక్కడైకి వచ్చేలా ఆకర్షిస్తున్నాయన్నది ఒప్పుకోవాల్సిన నిజం.

కళాకారులకి ప్రాంతీయ తత్వాలని అంటగట్తటం సరికాదనుకున్నా వారు చేసే వ్యాఖ్యలు మరీ ఎక్కువ అయినట్టుగా అనిపించిన ఘటనలూ ఉన్నాయి. మొన్నటికి మొన్న పాక్‌నటి సబాకమర్ సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ షాక్ అయ్యే వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ ఒక "చిచోరా" (చిల్లర మనిషి) అంటూ తనకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించే బాలీవుడ్ కి చెందిన ఒక హీరో మీదనే ఇలా రెచ్చిపోయింది. తాజాగా మళ్ళీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలపై పాకిస్థాన్ నటి, గాయని రబీ పీర్జాదా విమర్శలు గుప్పించింది

లాలీవుడ్:

లాలీవుడ్:

నిజానికి పాక్ సినీ పరిశ్రమ ఇప్పుడు పెద్ద సంక్షోబంలో ఉంది. లాలీవుడ్ (లాహోర్ సినీ ఇండస్ట్రీని ఇలానే పిలుస్తారు) సినిమాలన్నీ మన బాలీవుడ్ దెబ్బకి కుదలైపోతున్నాయి అందుకే అక్కడ అవకాశాలు లేక, ఉన్నా సరైన రెమ్యునరేషన్లు లేక బాలీవుడ్ కి క్యూకడుతున్నారు లాలీవుడ్ కళాకారులు.

సల్మాన్ పైనే సెటైర్లు :

సల్మాన్ పైనే సెటైర్లు :

అయితే ఇక్కడ సంపాదించుకోవటానికి వచ్చి మళ్ళీ ఇక్కడి జనాల మీదనే ఇలా మాట్లాడటం మామూలైపోయింది. మరొక వర్గమేమో పాక్ లో విడుదలయ్యే బాలీవుడ్ సినిమాలనుంచి తమ మార్కెట్ ని కాపాడుకుంటూ లాలీవుడ్ ని నిలదొక్కుకునేలా చేయాలనే తపనలో ఉన్నారు. అదే వర్గానికి చెందిన మరో నటి తాజాగా సల్మాన్ పైనే సెటైర్లు వేసింది... అసలు వీటిని సెటైర్లు అనే కాదు డైరెక్ట్ గా విమర్షలూ అనొచ్చు.

రబీ పీర్జాదా:

రబీ పీర్జాదా:

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలపై పాకిస్థాన్ నటి, గాయని రబీ పీర్జాదా విమర్శలు గుప్పించింది. సల్మాన్ సినిమాలు నేరాలను ప్రోత్సహిస్తాయని ఆరోపించింది. ‘‘బాలీవుడ్‌లో విడుదలయ్యే ప్రతి సినిమా క్రైమ్ లేదా క్రిమినల్ కార్యకలాపాల గురించే ఉంటుంది, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సినిమాలు.

యువతకు ఏం నేర్పుతున్నారు:

యువతకు ఏం నేర్పుతున్నారు:

నా ప్రశ్న ఏంటంటే, ఇండియన్ ఫిలిం మేకర్లు యువతకు ఏం నేర్పుతున్నారు? కేవలం క్రైమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నీతి కథలతో, సామాజిక నైతికతను ప్రతిబింబించేవిధంగా సినిమాలను నిర్మిస్తూ పాకిస్థాన్ సినీ పరిశ్రమ ఒకప్పుడు అత్యున్నత శిఖరాలపై ఉండేది.

బాలీవుడ్ దాన్ని పూర్తిగా మార్చేసింది:

బాలీవుడ్ దాన్ని పూర్తిగా మార్చేసింది:

మనం మన సినిమాల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నాం, కానీ బాలీవుడ్ దాన్ని పూర్తిగా మార్చేసింది'' అని నిప్పులు కురిపించింది. నసీం విక్కీతో కలిసి రబీ పీర్జాదా లాలీవుడ్ ప్రాభవాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్ మూల విలువలతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమంలో జరిగిన సభలో ఆమె ఈ విధంగా మాట్లాడింది

English summary
Pakistani actor Rabi Pirzada seems to have an issue with Pakistani movie buffs who prefer watching Indian films over the local cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu