»   » కోర్టులో ఏడ్చేసిన సల్మాన్ ఖాన్, ఆ మాత్రలు మింగిన వైనం....

కోర్టులో ఏడ్చేసిన సల్మాన్ ఖాన్, ఆ మాత్రలు మింగిన వైనం....

Posted By:
Subscribe to Filmibeat Telugu
కండల వీరుడిని మట్టి కరిపించిన 'బిష్ణోయ్': ఎందుకింతలా పోరాడారు..!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడింది. జోధ్‌పూర్ కోర్టు అతడికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. తనను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు వెలువడగానే సల్మాన్ ఖాన్ తీవ్రమైన భావోద్వేగానికి గురైఏడ్చేశారు. కోర్టు తీర్పు సమయంలో పక్కనే ఉన్న సల్మాన్ సోదరీమణులు అర్పిత, అల్విరా ఖాన్ ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు.

 తీర్పు రాగానే డిప్రెషన్లో ఆ మాత్రలు మింగిన సల్మాన్

తీర్పు రాగానే డిప్రెషన్లో ఆ మాత్రలు మింగిన సల్మాన్

తనను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు వెలువడగానే సల్మాన్ తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యారు... ఏడ్చేశారు. దీంతో పక్కనే ఉన్న ఆయన చెళ్లెల్లు యాంటీ డిప్రెసెంట్లు అతడికి అందించారు. కోర్టు తీర్పు అనంతరం సల్మాన్‌తో పాటు ఆయన చెళ్లెల్లు కూడా కన్నీరుమున్నీరు అయ్యారు.

జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు సల్మాన్

జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు సల్మాన్

కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో సల్మాన్ ఖాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పు వెలువడటానికి ముందే ఆయన కోసం జైలు అధికారులు ప్రత్యేకంగా గది కేటాయించి శుభ్రం చేయించారు.

 ఈ రాత్రికి జైల్లోనే సల్మాన్

ఈ రాత్రికి జైల్లోనే సల్మాన్

సల్మాన్ ఖాన్ గురువారం రాత్రి జోధ్‌పూర్ జైల్లోనే గడపనున్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్ శుక్రవారం ఉదయం విచారణకు రానుంది. జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ రాజస్థాన్ హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సమాచారం.

గతంలో 18 రోజులు జైల్లో

గతంలో 18 రోజులు జైల్లో

ఈ కేసులో సల్మాన్ ఖాన్ గతంలో 1998, 2006, 2007లో మొత్తం 18 రోజుల పాటు జైల్లో గడిపాడు. కాగా, శుక్రవారం జరిగే విచారణలో సల్మాన్ ఖాన్‌కు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 వారు సీరియస్‌గా తీసుకోవడం వల్లే

వారు సీరియస్‌గా తీసుకోవడం వల్లే

1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ కంకణి గ్రామంలో సంచరిస్తున్న రెండు కృష్ణ జింకలను తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు రుజువయ్యాయి. గ్రామంలోని బిష్నోయ్‌ వర్గానికి చెందిన వారు కృష్ణజింకను దైవంగా భావిస్తారు. అందుకే వారు దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో విషయం ఇక్కడి వరకు వచ్చింది. ఈ కేసులో సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, నీలమ్‌, టబును కోర్టు నిర్దోషులుగా తేల్చింది.

English summary
Superstar Salman Khan has been convicted in the 1998 blackbuck poaching case by a session's court in Jodhpur. The actor has been sentenced to 5 years in jail. Reportedly, the actor was in tears when the judge announced his 5-year jail term. The actor's sisters, Arpita Khan Sharma and Alvira were constantly by his side when the judgement was announced.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X