Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
సల్మాన్‌ఖాన్‌పై విమర్శలకు కౌంటర్ ఇచ్చిన సోదరుడు.. దబాంగ్ దర్శకుడిపై కేసు నమోదు
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనంగా మారిన సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ ఇన్సిడెంట్ రోజుకో మలుపు తిరిగుతోంది. అసలు మరణానికి కారణం ఏమిటనే విషయం కంటే సుశాంత్ చుట్టూ ఉన్న వివిధ కారణాలు ఎక్కువగా చర్చల్లోకి వస్తున్నాయి. ఇక బాలీవుడ్ అగ్ర తారాలపై వస్తున్న కామెంట్స్ కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళుతున్నాయి. ఇటీవల దబాంగ్ దర్శకుడు సల్మాన్ పై చేసిన కామెంట్స్ వివాదాలకు దారి తీస్తోంది. సుశాంత్ లాంటి నటులకు మంచి అవకాశాలు రాకపోవడానికి కారణం సల్మాన్ లాంటి వ్యక్తులేనని ఆయన కామెంట్స్ చేశారు.
తీవ్ర స్థాయిలో విమర్శలు
సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్న రోజు నుంచి బాలీవుడ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ సల్మాన్ ఖాన్ పై అలాగే అతని కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అభినవ్ కశ్యప్ సల్మాన్ ఖాన్ తో దబాంగ్ సినిమా చేశాడు. మొదట్లో వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. కొన్నేళ్ల తరువాత మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి.
సల్మాన్ సోదరుడు..
ఇక అభినవ్ చేసిన కామెంట్స్ కి సల్మాన్ సోదరుడు సీరియస్ అయ్యాడు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యాడు. దబాంగ్ 2 సినిమా మధ్యలో నుంచి అభినవ్ ని సల్మాన్ తప్పించడం అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది. దబాంగ్ వంటి హిట్ ఇచ్చినా కూడా తన కెరీర్ నాశనం చేయడానికి సల్మాన్ ప్రయత్నం చేశాడని అభినవ్ ఆరోపించారు.
చట్టపరమైన చర్యలు..
సల్మాన్ పైనే కాకుండా అతని సోదరుడిపై తండ్రిపై కూడా అభినవ్ విమర్శలు చేస్తూ.. వారు ఒక మాఫియా అంటూ వ్యాఖ్యానించారు. అయితే సల్మాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ ఈ వివాదంపై స్పందించాడు. నా సోదరుడు సల్మాన్ పై అలాగే మా తండ్రిపై కూడా అభినవ్ తప్పుడు కామెంట్స్ చేస్తూ.. మా గౌరవానికి భంగం కలిగిస్తున్నాడు. అందుకే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు అర్భజ్ ఖాన్ మీడియాకు తెలియజేశారు.
Recommended Video
ఎలాంటి నిజం లేదు..
ఇక దబాంగ్ 2 సినిమా నుంచి అభినవ్ కావాలనే తప్పుకున్నాడు అంటూ.. ఆ రోజు నుంచే అతనికి మాకు ఉన్న స్నేహం అనేది తెగిపోయిందని అన్నారు. ప్రస్తుతం అతను చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అతను చేస్తున్న తప్పుడు ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు అర్భజ్ ఖాన్ వివరణ ఇచ్చారు.