సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గణేష్ చతుర్థి వేడుకలు(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ దాదాపు దశాబ్దం కాలంగా ప్రతి సంవత్సరం గణపతి పూజా కార్యక్రమాన్ని వారు నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంటులో నిర్వహిస్తున్నారు. సల్మాన్ చిన్న చెల్లెలు అర్పిత ఖాన్ ద్వారా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని సల్మాన్ ఫ్యామిలీ ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నారు.

ప్రతి సంవత్సరం గణపతి పూజా కార్యక్రమాలతో సల్మాన్ ఖాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ సందడిగా ఉండేవి. అయితే ఈ సంవత్సరం గెలాక్సీ అపార్టుమెంటకు మరమ్మత్తులు చేస్తుండటంతో బాంద్రాలో అర్పితకు చెందిన మరొక అపార్టుమెంటులో ఈ సారి గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ ముస్లిం కుటుంబానికి చెందిన వాడు కదా..? వారి ఇంట్లో హిందువుల దేవుడైన గణేష్ వేడుకలు ఏమిటా? అనే సందేహం చాలా మందికి వచ్చింది. ఇలాంటి సందేహాలను సల్మాన్ పలు సందర్భాల్లో నివృత్తి చేసాడు.

సల్మాన్ ఖాన్ తండ్రి ముస్లిం ఫ్యామిలీకి చెందిన సలీమ్ ఖాన్ కాగా, తల్లి హిందూ ఫ్యామిలీకి చెందిన సుశీలా చరక్. తాను సగం హిందూ, సగం ముస్లిం అని సల్మాన్ అనేక సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు కూడా. ఒక గణేష్ చతుర్థి మాత్రమే కాదు, ఇతర హిందూ పండగలు కూడా సల్మాన్ కుటుంబ సభ్యులు జరుపుకుంటారు. అదన్నమాట మ్యాటర్!

గణేష్ చతుర్థి వేడుకలక వస్తూ..

గణేష్ చతుర్థి వేడుకలక వస్తూ..


సోదరి అర్పిత అపార్ట్‌మెంటులో ఏర్పాటు చేసిన గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొనేందుకు కార్లో వస్తున్న సల్మాన్ ఖాన్‌ను ఇక్కడ ఫోటోల చూడొచ్చు. సల్మాన్ ఫ్యామిలీ క్రమం తప్పకుండా గణేష్ చతుర్థి వేడుకలు జరుపుకుంటోంది.

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ


సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ చాలా పెద్దది. సల్మాన్ తండ్రి సలీమ్‌ఖాన్‌కు ఇద్దరు భార్యలు. సలీమ్ మొదటి భార్య సుశీలా చరక్ కుమారుడే సల్మాన్. ఆతర్వాత సలీమ్ ఖాన్ బాలీవుడ్ నటి హెలెన్‌ను కూడా పెళ్లాడారు.

సల్మాన ఖాన్

సల్మాన ఖాన్


సల్మాన్ ఖాన్ కుటుంబం గత దశాబ్ద కాలంగా వారు నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంటులో గణపతి బప్పా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఆయన చెల్లెలు అర్పిత ఖాన్ స్వయంగా చూసుకుంటారు.

హెలెన్

హెలెన్


గణేష్ చతుర్థి వేడుకలకు సల్మాన్ ఖాన్ సవతి తల్లి హెలెన్ కూడా హాజరయ్యారు. హెలెన్ దాదాపు 500లకుపైగా భారతీయ సినిమాల్లో నటించారు.

సూరజ్ పంచోలి

సూరజ్ పంచోలి


సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకలకు సూరజ్ పంచోలి తన తల్లితో కలిసి హాజరయ్యారు. సూరజ్ పంచోలి జియా ఖాన్ ఆత్మ హత్య కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.

మిని మాథుర్

మిని మాథుర్


బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ భార్య మిని మాథుర్ కూడా సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత అపార్టుమెంటులో నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకలకు హాజరయ్యారు.

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ


ఇక్కడున్న వారిలో ఎడమ వైపు నుంచి అల్వీరా(సల్మాన్ సిస్టర్), హెలెన్, సలీమ్ ఖాన్ (సల్మాన్ ఫాదర్), సల్మాన్ ఖాన్‌కు కుడి వైపు అతని తల్లి సుశీలా చరక్, ఎడమ వైపు సల్మాన్ సోదరి అర్పిత ఉన్నారు.

గణపతి బప్పా మరియా...

గణపతి బప్పా మరియా...


గణేష్ చతుర్థి వేడుకల్లో భజన కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ను ఇక్కడ దృశ్యంలో చూడొచ్చు. సల్మాన్ ఖాన్ నివాసంలో గణేష్ చతుర్థి వేడుక సందడిగా సాగింది.

తల్లితో కలిసి సల్మాన్

తల్లితో కలిసి సల్మాన్


సల్మాన్ ఖాన్ మరియు అతని తల్లి సుశీలా చరక్ బొజ్జగణపయ్యకు హారతి ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కిటకిట

కిటకిట


సల్మాన్ బిగ్ ఫ్యామిలితో పాటు ఆయన సన్నిహితులు, స్నేహితులు, బంధువుల రాకతో అర్పిత అపార్టుమెంటు కిటకిటలాడింది.

సంతోషంగా సల్మాన్

సంతోషంగా సల్మాన్


గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ఎంతో సంతోషంగా కనిపించాడు. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X