ఆ అరాచకాలన్ని అవాస్తవాలే
తనతో ప్రేమాయణం నడిపిన సమయంలో ఐశ్వర్యరాయ్ పై తాను పలుమార్లు చేయి చేసుకున్నానంటూ వచ్చిన వార్తల్లో అణువంతయినా నిజం లేదని కండలవీరుడు సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. అంతేకాదు, తను నిజంగా చేయి చేసుకుని ఉంటే, ఆమె బ్రతికి బట్ట కట్టి ఉండేదికాదని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇటీవల ఓ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అతగాడీ విషయాన్ని వెల్లడించాడు. వివేక్ ఒబరాయ్కు గుడ్ బై చెప్పి అభిషేక్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు, ఐశ్వర్య కొన్నాళ్లు సల్మాన్‌తో స్నేహం చేసింది.
ఆ సమయంలో సల్మాన్ తనను శారీరకంగా చాలాసార్లు బాధించాడని పలు సందర్భాలలో ఐసు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, అప్పుడెప్పుడూ ఆ విషయాన్ని ఖండించని సల్మాన్, ఇప్పుడు తీరిగ్గా ఆ విషయాన్ని ఖండిస్తున్నాడు. ఐసుపై తాను అరాచకాలకు పాల్పడడం అంతా అభూతకల్పనేనని వాదిస్తున్నాడు. చూస్తుంటె, మానిన గాయాన్ని రేపడంలో సల్మాన్ సిద్ధహస్తుడిలానే ఉన్నాడు!


Click it and Unblock the Notifications











