పెళ్లి వద్దు..పిల్లలు కావాలంటున్న సల్మాన్, కత్రినా గురించి కూడా!

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఈ స్టార్ హీరో వయసు ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటింది. సల్మాన్ పెళ్లి గురించి ఆయన కంటే ఆయన అభిమానులకే ఎక్కువ ఆత్రుత ఉండేది. ఎప్పటి నుండో అభిమానులు ఆయన పెళ్లి గురించి అడుగుతున్నా.... అదిగో ఇదిగో అంటూ దాట వేస్తూ వచ్చారు.

తాజాగా సల్మాన్ ఖాన్ ఏకంగా పెళ్లి ఆలోచనే విరమించుకున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా పూణెలో ఓ కార్యక్రమానికి హాజరైన సల్మాన్ కు మళ్లీ పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై సల్మాన్ స్పందిస్తూ...పెళ్లి వయసు దాటిపోయిందని, పెళ్లి చేసుకుంటానో? లేదో? చెప్పలేనని స్పష్టం చేసాడు.

Salman Khan Confirms Katrina Kaif & Ranbir Kapoor's Break-up

పెళ్లి గురించి పెద్దగా ఆసక్తి లేదని....అయితే ఇద్దరు, ముగ్గురు పిల్లలు కావాలని అనిపిస్తోందని అంటున్నాడు సల్మాన్. మరి సల్మాన్ మాటల్లో అర్థం ఏమిటో? పెళ్లి కాకుండానే ఎవరోనైనా జతకట్టి పిల్లలను కంటాడా? లేక దత్తత తీసుకోవడం లాంటివి చేస్తాడా? అనేది మాత్రం చెప్పలేదు.

మరో వైపు తన మాజీ ప్రియురాలు కత్రినాకైఫ్-రణబీర్ కపూర్ బ్రేకప్ గురించి కూడా సల్మాన్ ఖాన్ స్పందించారు. తాను విన్న వార్తలను బట్టి వారు విడిపోయారని భావిస్తున్నట్లు సల్మాన్ ఖాన్ తెలిపారు. నేను సహాయం చేయడం వల్లనే ఆమె కెరీర్లో ఎదిగానని చెప్పడం పెద్ద అబద్దం, ఆమె చాలా కష్టపడే మనిషి, అంతలా కష్టపడే వ్యక్తిని నేను ఎప్పూడూ చూడలేదు...అందుకే ఆమె ఇండియాలో ఆమె స్టార్ హీరోయిన్ అయింది అని వ్యాఖ్యానించారు సల్మాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X