»   » తీర్పు అనంతరం కోర్టులో ఏడ్చేసిన సల్మాన్ ఖాన్

తీర్పు అనంతరం కోర్టులో ఏడ్చేసిన సల్మాన్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిట్ అండ్ రన్ కేసులో దాదాపు 13 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ విచారణ ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ రోజు ఆయనకు ఈ కేసు నుండి విముక్తి లభించింది. ముంబై హైకోర్టు సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు విన్న వెంటనే సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ కన్నీళ్లు పెట్టాడు. ఏళ్లతరబడి దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను ఎట్టకేలకు నిర్దోషిగా తేలడంతో ఎమోషన్ అయ్యారు. దు:ఖం ఆపుకోలేకపోయాడు.

ఒకరి ప్రాణాలు బలిగొని, నలుగురిని గాయ పరిచిన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6, 2015న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సల్మాన్ తరుపు న్యాయవాది ముంబై హైకోర్టులో సవాల్ చేసి విజయం సాధించారు. సరైన సాక్ష్యాలు లేనందున సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఈరోజు(డిసెంబర్ 10)న తీర్పు వెలువరించింది.

Salman Khan crying after Hit-and-Run Case Verdict

సల్మాన్ ఖాన్ తాగి కారు నడిపాడనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందువల్ల ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారించలేమని కోర్టు వెల్లడించింది. సల్మాన్‌పై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు తీర్పును హైకోర్టు తప్పుబట్టింది.

ప్రాసిక్యూషన్ సాక్షాల్లో లొసుగులున్నాయని హైకోర్టు పేర్కొంది. కేవలం ఊహాగానాలతో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చమని హై కోర్టు పేర్కొంది. సెషన్స్ కోర్టు సరిగా విచారించలేదని తెలిపింది. ఈ తీర్పుతో సల్మాన్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు జరుపుకుంటున్నారు.

English summary
Salman Khan crying after Hit-and-Run Case Verdict. It has been proved to be a good Thursday for Salman Khan, for his family and for his fans across the world. The Bollywood superstar has now become a "Free Bird" today (Thursday, Dec 10). All charges against Salman Khan in connection with infamous 2002 hit-and-run case have been dropped by the Bombay High Court which has delivered its final verdict today.
Please Wait while comments are loading...