దబాంగ్ దెబ్బకు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ రికార్డులు గల్లంతు..!
సల్మాన్ ఖాన్ కు పూర్వవైభవం తెచ్చిన సినిమా దబాంగ్. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ మరోసారి తన సత్తా చాటారు. అంతేకాకుండా రికార్డులను కూడా తిరగరాయడానికి సిద్దం అయ్యారు. అంతేకాకుండా బాలీవుడ సినిమాలకు ఓ సవాలు విసురుతుంది. మొదటివారం వసూళ్ళతో ఆమీర్ ఖాన్ 3ఇడియట్స్ కు చెక్ చెప్పిన దబాంగ్, రెండో వారం వసూళ్ళ తో గజినీకి పోటీగా నిలబడపోతుంది. ఆమీర్ ఖాన్ గజని 50 రోజులకు 115 కోట్లు వసూలుచేస్తే, దబాంగ్ రెండో వారానికే 115కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఇండియాలో దబాంగ్ మొదటివారంలో 81కోట్లు వసూలు చేస్తే రెండోవారంలో 35 కోట్లు ఫైనే వసూలుచేసింది. దీనిని బట్టి చూస్తే దబాంగ్ అటు మాస్ ని మాత్రమే కాకుండా క్లాస్ ని కూడా ధియేటర్లుకు రప్పిస్తుందనడంలో సందేహా లేదు. ఇండియాలో మరోసారి సల్మాన్ ఖాన్ తనేంటో ఈ సినిమాతో నిరూపించాడు. దబాంగ్ దెబ్బతో మిగిలిన బాలీవుడ్ సినిమాలు కలెక్షన్లు వసూళ్ళలో వెనక పడ్డాయి.
ఇటీవల ఈ సినిమా స్పెషల్ షోను మహేష్ తన బార్య నమ్రతతో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో చూసారు. సల్మాన్ ఖాన్ సోదరుడు దబాంగ్ నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్ ఈ చిత్రం షో ను ఎరేంజ్ చేసారు. ఇక మహేష్..తన ఖలేజా చిత్రం డబ్బింగ్ పూర్తి చేసుకుని ఈ చిత్రం చూడ్డానికి ప్రసాద్ ల్యాబ్ కి వచ్చారు. ఇక మహేష్ సూపర్ హిట్ చిత్రం పోకిరిని...అప్పట్లో సల్మాన్ చూసి ముచ్చట పడి వాంటెడ్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాన సంగతి అందరికి తెలిసిందే..


Click it and Unblock the Notifications











