Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగవల్లి రివ్యూలు చూసి జడుసుకున్న స్టార్ హీరో
వెంకటేష్, పి.వాసు కాంబినేషన్ లో రూపొంది ఈ శుక్రవారం విడుదలైన నాగవల్లి చిత్రం యావరేజ్, బిలో యావరేజి అంటూ రివ్యూలు వచ్చాయి. దాంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేద్దామని నిర్ణయించుకున్న సల్మాన్ ఖాన్ డైలమోలు పడ్డారు. ఈ చిత్రం రివ్యూలు కంగారుగా చూసిన ఈయన రిజల్ట్ చూసి జడుసుకుని ఈ ప్రయత్నం మానుకుందామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో అక్షయ్ కుమార్..చంద్రముఖి చిత్రం రీమేక్ భూల్ భులయ్యా ని చేసి హిట్ కొట్టారని సల్మాన్ ఈ చిత్రం చేయటానికి ఆసక్తి చూపారు.
ఇందునిమిత్తం పి.వాసుతో కూడా చర్చలు జరిపారు. ఇక సల్మాన్ ఖాన్ పోకిరీ రీమేక్ వాంటెడ్ ని ప్రభుదేవా దర్శకత్వంలో చేసినప్పటినుంచి ఆయన దృష్టి సౌత్ సినిమాలపై పడింది. ప్రస్తుతం తెలుగులో హిట్టయిన రెడీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అలాగే బాడీ గార్డ్ చిత్రాన్ని సైతం సల్మాన్ ఖాన్ రీమేక్ చేయటానికి రెడీ అయ్యారు. మరో ప్రక్క రవి తేజ కిక్ చిత్రం రైట్స్ ని సైతం తీసుకున్నారు.