»   » ఆశ్చర్యం: సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయబోతున్నాడు

ఆశ్చర్యం: సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయబోతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు విన్నది నిజమే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయబోతున్నాడు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉన్న సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయడం అంటే ఆశ్చర్య పడాల్సిన విషయమే. అసలు వివరాల్లోకి వెళితే శ్వేతా రొహిరా అనే అమ్మాయి గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా రాఖీ కడుతోంది. ఆ అమ్మాయిని సల్మాన్ తన సొంత చెల్లిలా చూసుకుంటాడు.

త్వరలో శ్వేతా వివాహం గోవాలో జరుగబోతోంది. బాలీవుడ్ నటుడైన పులకిత్ సామ్రాట్‌ను ఆమె వివాహం చేసుకోబోతోంది. అయితే శ్వేతా రోహిరా తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో.....కన్యాదానం చేసే బాధ్యతను సల్మాన్ ఖాన్ తీసుకోబోతున్నాడు. సల్మాన్ ఖాన్ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Salman Khan to do 'kanyadaan' at Pulkit Samrat's wedding

ఈ సంగతి పక్కన పెడితే.....సల్మాన్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. ఇలా అందరి పెళ్లిళ్లు దగ్గరుండి చేయిస్తున్న సల్మాన్ ఖాన్ తన పెళ్లి విషయం గురించి మాత్రం ఆలోచించడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ తన పెళ్లి విషయాన్ని దాట వేస్తూ రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చాడు సల్మాన్. తాను ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ఇపుడు ఎలా ఉన్నానో అలానే తన జీవితం కొనసాగిస్తానని సల్మాన్ ఖాన్ స్పష్టం చేసారు.

ఇటీవల ఓ టీవీ టాక్ షోలో సల్మాన్ ఖాన్ తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు తన సినిమాలు, ఇతర విషయాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. వివాహం చేసుకోవడంపై తనకు ఆసక్తి లేదని, అందుకే ఎప్పటికీ ఇలానే ఉండి పోవాలని నిర్ణయించుకున్నట్లు సల్మాన్ ఖాన్ చెబుతున్నారు.

English summary
When it comes to promoting new kids, Bollywood biggies can surely go out of their way. Salman Khan is one such actor who has been seen to launch the careers of talented newbies, actor Pulkit Samrat being one of them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu