కోస్టార్ కోసం రూ. 5 లక్షలు దానం చేసిన మన హీరో
ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. చారిటీ కార్యక్రమాల్లో ఎప్పుడు అందరికంటే ఓ అడుగు ముందు ఉండే సల్మాన్ ఖాన్ ఇటీవల తన కోస్టార్, సంతోష్ శుక్లా యొక్క సోదరుడైన 34 ఏళ్ల అశుతోష్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రూ. 5 లక్షలు డొనేట్ చేసారు.
ఇప్పటికే బీయింగ్ హ్యూమన్ సంస్థ ద్వారా సల్మాన్ ఖాన్ లక్షలు ఖర్చు పెడుతూ అనేక చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆపదల్లో ఉన్న కో స్టార్లకు సహాయం అందించడంలోనూ ముందుంటారు. అందు వల్ల ఇపుడు ఆయన సంతోష్ శుక్లా సోదరుడికి సహాయం చేయడం పెద్ద ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ కాదు.
సల్మాన్ ఖాన్ సహాయం చేసిన విషయమై సంతోష్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ వెల్లడించారు. తమ సమస్య గురించి చెప్పి అడిగిన వెంటనే సల్మాన్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసారని, ఆయన సహాయం మరువలేనిది అని సంతోష్ శుక్లా వెల్లడించారు.
సహాయం చేయడమే కాకుండా....వారి ఇంటికి ఫోన్ చేసి సంతోష్ శుక్లా సోదరుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తన భర్తకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చిన అశుతోష్ భార్యను సల్మాన్ ఖాన్ అభినందించారు. సల్మాన్ ఖాన్ తన సంపాదనలో ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












