సెన్సేషన్ క్రియేట్ చేసిన 'పులి'- వేయింట్ చేస్తున్న సల్మాన్ ఖాన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" సెన్సేషన్ సృష్టిస్తోంది. 'ఖుషీ" డైరెక్టర్ ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించడం కూడా సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది. తన ప్రతి చిత్రంలోనూ డాన్సులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం మూవ్ మెంట్స్ తో సరిపెట్టే పవన్ ఈ సారి ఛాలెంజ్ గా తీసుకొని డాన్సులు అద్భుతంగా చేశాడని తెలుస్తోంది.
అలాగే అతని స్టైల్ విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అవకముందే ఫ్యాన్స్ అతని స్టైల్ ని కాపీ చేసేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక పవన్ స్టైల్ ఒక ట్రెండ్ గా మారే అవకాశముందని అభిమానులు చెప్తున్నారు. అలాగే ఇందులో శ్రియ చేసిన ఐటమ్ సాంగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలోని పాటల్లో శ్రియ సాంగ్ కి ఆడియో పరంగా ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇన్ని విశేషాలతో వస్తోన్న 'కొమరం పులి" డెఫినెట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మెగాభిమానులు కాన్సిడెన్స్ తో వున్నారు.
అటు మెగా అభిమానులే కాకుండా బాలీవుడ్ సైతం పవన్ 'పులి" రిలీజ్ పై విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇటీవల ఓ హిందీ న్యూస్ ఛానల్ 'కొమరం పులి" చిత్రంపై ఓ ప్రొగ్రామ్ చేసింది అందులో ఈ చిత్రంలోని స్టంట్స్ గురించి, గ్రాఫిక్స్ గురించి, ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. దాంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు సినిమా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. దాంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా రైట్స్ తీసుకొని హిందీలో రీమేక్ చేద్దామని అత్యుత్సాహంగా ఉన్నారట. సల్మాన్ ఖాన్ అయితే ఈ సినిమా రీమేక్ లో నటించడానికి బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











