సల్మాన్, ఇషా మధ్య...కైపెక్కించే కెమిస్ట్రీ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హేమా మాలిని కూతురు ఇషా డియోల్ మధ్య కైపెక్కించే కెమిస్ట్రీ కుదిరింది. కొంపతీసి ఇద్దరి మధ్య ఏదో 'సం"బంధం ఉందని అనుకునేరు, అలాంటిదేమీ లేదు. హేమా మాలిని స్వయంగా దర్శకత్వం వహిస్తూ రూపొందిస్తున్న 'టెల్ మి ఓ ఖుదా" సినిమాలో సల్మాన్ ఖాన్, ఇషా ఓ సాంగులో తలుక్కుమనబోతున్నాడు అంతే. ముంబై బాంద్రాలోని ఓ నైట్ క్లబ్‌లో వీరిద్దరిపై ఈ సాంగు చిత్రీకరణ సాగింది. సల్మాన్ నటించడంపై ఆనందం వ్యక్తం చేయడమే కాదు, మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటూ చెప్పుకుంటూ పబ్లిసిటీ పెంచుకుంటోంది ఇషా.
కాగా...హేమా మాలిని నిర్మాణ, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఆమె మాజీ భర్త ధర్మేంద్ర, కుమార్తె ఇషా డియోల్ తొలిసారి వెండి తెరపై తండ్రి కూతుర్లుగా కనిపించబోతున్నారు. వాస్తవానికి ధర్మేంద్ర పాత్రకు తొలుత అమితాబ్ బచ్చన్ అయితే బాగుటుందని అనుకున్నారు. కానీ అమితాబ్ ఒప్పుకోక పోవడంతో ధర్మేంద్రను ఎంపిక చేశారు. మరి అమితాబ్ ఒప్పుకుని ఉంటే సల్మాన్ ఈ సినిమాలో నటించే వాడు కాదేమో? ఎందుకంటే సల్మాన్ ఎక్స్ లవర్ ఐశ్వర్యరాయ్ బిగ్ బి కోడలు కదా. అదన్నమాట సంగతి.


Click it and Unblock the Notifications











