గ్యాంగ్ రేప్ సంఘటనపై టాప్ హీరో సీరియస్!
ఈ సంఘటనపై సల్మాన్ ఖాన్ ఉద్వేగంగా స్పందించారు. 'అలాంటి వ్యక్తులను చంపేస్తేనే మరోసారి ఇలాంటి అకృత్యాలు జరుగకుండా ఉంటాయని, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం నిజంగా సిగ్గుచేటని' సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాంటి నేరాలు చేయడానికే వణికిపోయేలా శిక్షలు ఉండాలని సల్మాన్ ఖాన్ అభిప్రాయ పడ్డారు.
తన తాజా సినిమా 'దబాంగ్ 2' చిత్ర ప్రమోషన్లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పందిస్తూ సల్మాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసారు. 'నేరాలన్నీ పోలీసులే అరికట్టాలంటే సాధ్యం కాదు. నేరం జరిగే ప్రతి చోట పోలీసులు ఉండలేరు. సామాన్య పౌరులు నేరాల్ని అరికట్టడంలో భాగస్వాములు కావాలి' అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.
దబాంగ్ 2 సినిమా విషయానికొస్తే... సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ఈచిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించారు. డిసెంబర్ 21న ఈచిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన సోనాక్షి హీరోయిన్ గా నటిస్తుండగా..... కరీనా కపూర్, మలైకా అరోరా, సంజయ్ దత్ స్పెషల్ సాంగుల్లో దర్శనం ఇవ్వనున్నారు.


Click it and Unblock the Notifications












