twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెలబ్రిటీ అంటే ఇంతే మరి, సల్మాన్ ఖాన్ కి వంద కోట్ల పరువు నష్టమట...

    |

    మొగున్ని కొట్టి మొగసాలకెక్కటం అనే సామెత విన్నారు కదా ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసే పని చూస్తే అలానే అనిపించింది. 18 ఏళ్ల క్రితం సల్మాన్ కృష్ణజింకల వేట కేసులో అసలు నిజం ఏమిటన్నది బహిరంగ రహస్యమే అని అనుకునే వారే ఎక్కువ. కానీ కోర్టు లో వచ్చిన తీర్పుని గౌరవించి తీరాలి కాబట్టి సల్మాన్ విషయం లో ఎవరూ అతన్ని దోషి గా నిరూపించే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ విషయం లో సల్మాన్ పాత్ర పై మరిన్ని ఆధారాల కోసం ఈ ఉదంతంపై ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది.

    ఈ వీడియోలో సల్మాన్ వేటాడుతుండగా చూశామని కొందరు చెప్పారు. అయితే తర్వాత వారు మాట మార్చి తాము అలా అనలేదని, తమ మాటలు వక్రీకరించి, వేరే అర్ధం స్ఫురించేలా వీడియో ఎడిట్ చేశారని వివరించారు. ఇక, ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించడంతో స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన ఛానల్ను ఇరుకున పెట్టేందుకు సల్లూభాయ్ పరువునష్టం దావా వేశాడు. తన ప్రతిష్టకు భంగం కలుగజేసిన ఛానల్ రూ.100కోట్లు చెల్లించాలని బోంబే హై కోర్టును ఆశ్రయించాడు. అదన్న మాట సంగతి. నిజమేమిటో చాలామందికి అర్థం చేయించాలనుకున్న ఆ చానల్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. సల్మాన్ నిర్దీషిగా నిరూపించబదటమే కాదు. ఇప్పుడు నిజం బయటికి తీయాలనుకున్న చనల్ కే ఒక సమస్యని తెచ్చిపెట్టాడు

    Salman Khan files 100 crore defamation suit against TV channel

    రూ.100కోట్ల పరువు నష్టం కోరుతూ సల్మాన్ ఖాన్ ఆగస్టులోనే కోర్టుకెళ్లాడు. స్టింగ్ ఆపరేషన్ తనపై బురద జల్లేందుకే తీశారని వ్యాజ్యంలో పేర్కొన్నాడు. స్టింగ్ ఆపరేషన్లో భాగంగా షూట్ చేసిన ఫుటేజ్ను ధ్వంసం చేయాలని, భవిష్యత్లో ఆ వీడియోలకు సంబంధించిన దృశ్యాలు ఎక్కడా ప్రసారం కాకుండా చూడాలని సల్మాన్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ కేసు నవంబర్ 18న విచారణకు రానుంది. ఇదిలాఉంటే, ఈ పిటిషన్ దాఖలైనప్పుడే తాము సల్మాన్పై చేసిన శూలశోధన దృశ్యాలను ధ్వంసం చేశామని సదరు టీవీ ఛానల్ ఇటీవలే తెలిపింది. స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియోలేవీ తమ వద్ద లేవని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో సల్మాన్ పార్టీ కోర్టు బయటే రాజీ కుదుర్చుకోవాలని యత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి, 'భజరంగీ భాయ్జాన్" పరువు నష్టం కథ ఎక్కడికి చేరుతుందో వేచి చూడాలి మరి.

    English summary
    Bollywood Hero Salman Khan files 100 crore defamation suit against TV channel for sting operation on his Dear hunting case
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X