బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాను నటించిన 'చోరీ చోరీ చుప్కే చుప్కే' చిత్రానికి సంబంధించి తనకు ఇంకా రావాల్సిన పారితోషికం ఇప్పించాలని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నిరోధక చట్టం(మోకా) న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆయనకు ఇవ్వాల్సిన కోటిన్నర పారితోషికంలో, కోటీ పాతిక లక్షలు చెల్లించిన తర్వాత సినీ నిర్మాత నజీం రిజ్వీ, ఫైనాన్సియర్ భరత్ షాలు చీకటి సామ్రాజ్యంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయ్యారు.దాంతో మరో పాతిక లక్షలు మొత్తం పెండింగ్ ఉండిపోయింది. ఇక ఆ చిత్రం ఆదాయాన్ని మోకా కో ర్టు ద్వారా రాష్ట్ర ఖజానాలో జమ చేశారు. తీర్పు వెలువడి న అనంతరం పూర్తి పారితోషికాన్ని సల్మాన్ ఖాన్ పొందవచ్చునని మోకా కోర్టు తెలిపింది. ఈ నెల 20న సల్మాన్ అభ్యర్థనపై మోకా కోర్టు జడ్జి షిండే వాదనలు వింటారు.