డబ్బు కోసం నిర్మాతపై... సల్మాన్ కంప్లైంట్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనకు రావాల్సిన డబ్బుల విషయమై 'వీర్" సినిమా నిర్మాతపై ఎఫ్.డబ్లు.ఐ.సి.ఇ(ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండస్ర్రీ సినీ ఎంప్లాయిస్) కి పిర్యాదు చేశారు. వీర్ సినిమా నిర్మాత విజయ్ గలాని...తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ లో రూ. 15 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని సల్మాన్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు విషయమై సల్మాన్ ఇప్పటికే నోటీసులు పంపినా గలాని నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆయన ఈ చర్యకు పూనుకున్నారు.
అతనితో తనకు ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఎఫ్.డబ్లు.ఐ.సి.ఇ అధ్యక్షుడిని సల్మాన్ కోరాడు. ఈ మేరకు ఎఫ్.డబ్లు.ఐ.సి.ఇ అధ్యక్షుడు ధర్మేష్ తివారి కలుగ చేసుకుని...గలానిని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఇద్దరూ ఫేస్ టు ఫేస్ మీటయ్యే అవకాశం ఉంది. చిన్న అమౌంట్ అయితే సల్లూ భాయ్ లైట్ తీసుకునే వాడని, 15 కోట్ల వ్యవహారం కాబట్టే పైసా వసూల్ పై సీరియస్ గా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
సల్మాన్ ఖాన్, జరీన్ ఖాన్ జంటగా...అనిల్ శర్మ దర్శకత్వంలో 2010 జనవరిలో విడుదలైన వీర్ సినిమా పరమ ప్లాపుగా నిలిచి నిర్మాతలకు బోలెడు నష్టాల్ని మిగిల్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











