»   » ఫ్యాన్స్ షాక్: పెళ్లి చేసుకోనని ప్రకటించిన సల్మాన్ ఖాన్

ఫ్యాన్స్ షాక్: పెళ్లి చేసుకోనని ప్రకటించిన సల్మాన్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అంటూ అభిమానులు ఎదురుచూడటం.....గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ తన పెళ్లి విషయాన్ని దాట వేస్తూ రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చాడు సల్మాన్. తాను ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ఇపుడు ఎలా ఉన్నానో అలానే తన జీవితం కొనసాగిస్తానని సల్మాన్ ఖాన్ స్పష్టం చేసారు.

ఇటీవల ఓ టీవీ టాక్ షోలో సల్మాన్ ఖాన్ తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు తన సినిమాలు, ఇతర విషయాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. వివాహం చేసుకోవడంపై తనకు ఆసక్తి లేదని, అందుకే ఎప్పటికీ ఇలానే ఉండి పోవాలని నిర్ణయించుకున్నట్లు సల్మాన్ ఖాన్ చెబుతున్నారు.

సల్మాన్ ఖాన్ లవ్ ఎఫైర్లు, అతని పెళ్లి గురించిన వార్తలు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను ఎప్పటికీ సింగిల్‌గానే ఉంటానని సల్మాన్ ఖాన్ చెప్పడంతో ఆ వార్తలకు తెర పడ్డట్లయింది.

తాను ఎప్పుడు తన ఖాళీ సమయాన్ని 'బీయింగ్ హ్యూమన్' సంస్థ ద్వారా స్వచ్ఛంద సేవ చేయడానికే ఉపయోగిస్తానని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనగానీ, సినిమాలకు దర్శకత్వం వహించే ఉద్దేశ్యం కానీ లేదని, నటుడిగానే తన కెరీర్ కొనసాగిస్తానని సల్మాన్ ఖాన్ తెలిపారు.

సల్మాన్ కెరీర్లో పాపులర్ అయిన ఎఫైర్ల గురించిన వివరాలు స్లైడ్ షోలో....

సంగీతా బిజిలానీ

సంగీతా బిజిలానీ


సల్మాన్ ఖాన్ కెరీర్లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఎఫైర్ సంగీతా బిజిలానీతో. ఈ మాజీ బ్యూటీ క్వీన్‌తో సల్మాన్ అప్పట్లో చాలా క్లోజ్‌గా ఉండే వాడు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.

సల్మాన్ ఖాన్-సోమీ అలీ

సల్మాన్ ఖాన్-సోమీ అలీ

పాకిస్థాన్ బ్యూటీ సోమీ అలీతో సల్మాన్ ఖాన్ అప్పట్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. అయితే సల్మాన్ ఖాన్ ఆల్కహాలిజం గురించి సోమీ అలీ పబ్లిక్‌లో మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య బంధం తెగి పోయింది.

సల్మాన్ -ఐశ్వర్యరాయ్

సల్మాన్ -ఐశ్వర్యరాయ్


ఇక సల్మాన్ ఖాన్-ఐశ్వర్యరాయ్ ప్రేమాయణం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అప్పట్లో వీరి వ్యవహారం దాదాపు పెళ్లి వరకు వెళ్లింది. అయితే కొంతకాలానికి సల్మాన్‌లో ఐశ్వర్యరాయ్ గొడవ పడింది. సల్మాన్ తనను హింసించాడనే ఆరోపణలు చేసింది. ఆమెతో బ్రేకప్ తర్వాత సల్మాన్ ఖాన్ చాలా ఇబ్బందులు పడ్డాడు.

సల్మాన్ ఖాన్-స్నేహా ఉల్లాల్

సల్మాన్ ఖాన్-స్నేహా ఉల్లాల్


సల్మాన్ నటించిన ‘లక్కీ' చిత్రంలో స్నేహా ఉల్లాల్ నటించింది. స్నేహా ఉల్లాల్... ఐశ్వర్యరాయ్ మాదిరిగా ఉండటంతో అప్పట్లో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్

సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్


ఐశ్వర్యరాయ్‌తో బ్రేకప్ తర్వాత సల్మాన్ ఖాన్ బాగా దగ్గరైంది కత్రినా కైఫ్‌కే. ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య ఎఫైర్ హద్దులు దాటిందనే వార్తలు సైతం వినిపించాయి. అయితే కొన్ని గొడవల వల్ల ఇద్దరూ విడిపోయారు.

సల్మాన్ ఖాన్-జరీన్ ఖాన్

సల్మాన్ ఖాన్-జరీన్ ఖాన్


కత్రినా కైఫ్‌తో విడిపోయిన తర్వాత సల్మాన్ కత్రినా పోలికలతో ఉన్న జరీన్ ఖాన్‌కు దగ్గరయ్యాడు. ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేసాడు. అయితే ఈ ఇద్దరి బంధం కూడా మధ్యలోనే తెగి పోయింది.

సల్మాన్ ఖాన్-లులియా వేంటర్

సల్మాన్ ఖాన్-లులియా వేంటర్


గత కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ రొమేనియర్ భామ లులియా వేంటర్‌ను పెళ్లాడబోతున్నాడనే వార్తలు సైతం వినిపించాయి. సల్మాన్ కుటుంబ సభ్యులతో కూడా ఆమె చాలా క్లోజ్‌గా కనిపించడంతో అంతా నిజమే అనుకున్నారు.

సల్మాన్-జాక్వెలిన్

సల్మాన్-జాక్వెలిన్


ఇక సల్మాన్ ఖాన్ తాజా సినిమా ‘కిక్'లో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతనితో క్లోజ్‌గా ఉండటం చూసిన కొందరు ఇద్దరి మధ్య ఏదో సబంధం ఉండే ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Finally, Salman Khan has announced that he might never marry and will continue his life like he is living now. In a recent talk show, actor Salman Khan talked about his marriage and work plans and the star was sporting enough to tell everything frankly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu