For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ డూప్ తో సల్మాన్ ఖాన్

    By Srikanya
    |

    అచ్చుగుద్దినట్లు కత్రినాకైఫ్ మాదిరిగా ఉండే అమ్మాయిని సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం 'వీర్‌' తో సినీ రంగానికి పరిచయం చేస్తున్నాడు. ముంబైకి చెందిన ఆ అమ్మాయి పేరు జరీన్‌ ఖాన్‌. గతంలో ఐశ్వర్యా రాయ్‌ మాదిరిగా కనిపించే స్నేహా ఉల్లల్‌ని 'లక్కీ' సినిమాతో పరిచయం చేసిన సల్మాన్‌, ఇప్పుడు కత్రినా పోలికలతో ఉన్న జరీన్‌ను పరిచయం చేస్తుండటం సహజంగానే అందిరిలో ఆసక్తి రేగుతోంది. 'గదర్‌..ఏక్‌ ప్రేమ్‌కథా' ఫేమ్‌ అనిల్‌ శర్మ దర్శకత్వం వహించన ఈ 'వీర్‌' చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

    'వీర్‌' చిత్రం ప్రమోషన్‌ స్టిల్స్‌ విడుదల కాగానే అందులో జరీన్ ని చూసిన బాలీవుడ్ అంతటా ఒకటే చర్చ. ఇక జరీన్‌ కుటుంబం ముంబై శివార్లలో బాంద్రాలో నివశిస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా ఆమె చదువుకు మధ్యలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సివచ్చింది. అలాగే కాలేజీ రోజుల్లో చాలా లావుగా దాదాపు వంద కిలోల బరువుతో ఉన్న ఆమె ఆ తర్వాత జంక్‌ఫుడ్‌ మానేశాకే బరువు తగ్గింది. సల్మాన్‌ అభిమాని అయిన ఆమె'యువరాజ్‌' సెట్స్‌మీద తొలిసారి అతన్ని కలిసి ఆటోగ్రాఫ్‌ తీసుకుంది. అప్పుడే సల్మాన్‌ దృష్టిలో పడింది. 'వీర్‌'లో అతని సరసన నటించే అవకాశం అలా వచ్చిందే. ఈ సినిమాతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తాననేది నమ్మకంగా ఆమె చెబ్తున్న మాట. బెస్టాఫ్ లక్ జరీన్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X