సిగెరెట్ త్రాగుతూ పట్టుబడ్డ స్టార్ హీరో రెండు వందలు జరిమానా
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మునిగితేలుతూంటాడు. తాజాగా ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం రోజున బహిరంగంగా సిగెరెట్ కాల్చినందుకు పాటియాలా వైద్యశాఖ రూ.200 జరిమానా విధించింది. 'బాడీగార్డ్' చిత్రం షూటింగ్ సంర్భంగా ఖాన్ పాటియాలాలో ఉన్నారు. హోటల్ నీమ్రానా వద్ద మూవీ సెట్‌లపై ఆయన పొగ తాగుతూ కనిపించారు. నగరంలో మరో పర్యాయం ఇలా చేయరాదని ఖాన్‌ను హెచ్చరించారు. మే 27న కరీనా కపూర్‌తో కలసి సల్మాన్ ఇక్కడకు వచ్చారు. హోటల్ లాన్స్ వద్ద ఖాన్ పొగతాగుతూ కనిపించారు. ఈ సంగతి తెలిసిన తర్వాత ఖాన్ పైన హోటల్ యజమానిపైన చర్య తీసుకుని జరిమానా విధించినట్లు పాటియాలా డిప్యూటీ మెడికల్ కమిషనర్ డాక్టర్ చరణ్‌జిత్ సింగ్ చెప్పారు. ఇక సల్మాన్ ఖాన్ నటించిన రెడీ ఈ శుక్రవారం విడుదల కానుంది. అసిన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్టయిన రెడీకి రీమేక్. అలాగే బాడీగార్డ్ చిత్రం కూడా మళయాళంలో హిట్టయిన చిత్రానికి రీమేక్.అదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











