సల్మాన్‌ఖాన్ కు రిలీఫ్, సమస్య పరిష్కారమైంది
కొన్ని సాంకేతిపరమైన కారణాలతో ఆ పత్రాలు సకాలంలో సమర్పించలేక పోయామని, ఇప్పుడు సమస్య పరిష్కారమైందన్నారు. సల్మాన్‌ఖాన్ బ్రిటన్‌లో వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొంటారు. సల్మాన్ కు ఓకేసులో ఐదేళ్లు, మరో కేసులో ఒక సంవత్సరం జైలు విధించారు. అయితే హై కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. జోద్ పూర్ కోర్టులోని సల్మాన్ కేసుకు సంబంధించిన పత్రాలు చేరలేదని.. దాంతో వీసా ఇవ్వడానికి సాంకేతిక కారణాలు తలెత్తాయని సలీమ్ ఖాన్ తెలిపారు.
ఇక సల్మాన్ పై ఉన్న కేసులు ఏమిటంటే... 1998లో రాజస్థాన్‌లో 'హమ్ సాత్ సాత్ హై' షూటింగులో ఉన్నప్పుడు ఆయన కృష్ణ జింకను వేటాడి చంపాడనే ఆరోపణలపై కేసు విచారణ జరుగుతోంది. 2002లో కారు వేగంగా నడిపి ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తిని ఢీకొని వారి మరణానికి కారణమయ్యారనే కేసుపైనా విచారణ సాగుతోంది. ఈ ఆరోపణలు నిరూపణైతే ఆయనకు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
సల్మాన్‌పై ఐపీసీ సెక్షన్లు 279 (నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనం నడపటం), 337, 338 , 427 వంటి అభియోగాలు మోపారు. వీటితోపాటు మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 34(ఎ), (బి) (వాహనం రిజిస్ట్రేషన్ రద్దు) రెడ్ విత్ 181 (నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడపటం), 185 (మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనం నడపటం), బోంబే ప్రొహిబిషన్ చట్టం కింద కూడా సల్మాన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ కోర్టుకు హాజరయ్యారు. అయితే తదుపరి విచారణకు తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కు కోర్టు అనుమతించింది.
అవసరమున్నప్పుడు న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అనంతరం కేసు విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది. 2002 సెప్టెంబర్ 28న సబర్బన్ బాంద్రాలో సల్మాన్‌ఖాన్ నడుతుపున్న వాహనం.. ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.


Click it and Unblock the Notifications












