పెళ్లి కానుక: సోదరికి సల్మాన్ ఖాన్ ఖరీదైన గిఫ్టు!
హైదరాబాద్: సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం ఈ రోజు హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఫ్యామిలీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ముద్దుల చెల్లి పెళ్లి కోసం సల్మాన్ ఖాన్ డబ్బులను నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. రెండు రోజులు ఫ్యాలెస్‌ను వివాహ వేదికగా వాడుకున్నందుకు రూ. 2 కోట్లు చెల్లిస్తున్నారంటే...మొత్తం పెళ్లి ఖర్చు ఎంత ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
భారీగా ఖర్చు పెట్టి పెళ్లి చేయడంతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే ఫ్లాటును సోదరికి గిఫ్టుగా ఇస్తున్నాడు సల్మాన్. ముంబై కార్టర్ రోడ్డులో రూ. 16 కోట్లు విలువ చేసే టెర్రస్ అపార్టుమెంటును కొత్త జంటకు కానుకగా అందజేయనున్నాడు. పెళ్లి అనంతరం ఇద్దరూ ఆ అపార్టుమెంటులోకి షిప్టు కానున్నారు.

అర్పిత ఖాన్ వివాహ వేడుక హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఫలక్‌నుమ ప్యాలెస్‌లో నేడు, రేపు జరుగనుంది. వివాహం అనంతరం నవంబర్ 21న తేదీన ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసారు. పెళ్లి వేడుకకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించినట్లు సమాచారం. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగనుంది.
ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ గత కొంత కాలంగా ప్రేమవ్యహారం నడుపుతోంది. ఇద్దరూ ఈవిషయాన్ని ఇంట్లోవారికి చెప్పి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరుగబోతోంది. ఆయుష్ శర్మ వేసుకోబోయే డ్రెస్సును హైదరాబాద్‌కు చెందిన మక్దూమ్ బ్రదర్స్ డిజైన్ చేసారు. ఇందుకోసం వారు 15 రోజులు కష్టపడ్డారట.


Click it and Unblock the Notifications











