సల్మాన్ ఖాన్‌కు రెండు రోజు బెయిల్ మంజూరు
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు 2 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం మత్తులో కారు నడిపి ఫుట్ పాత్ పై పడుకున్న ఒకరి మరణానికి, నలుగురు గాయపడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
సల్మాన్ ఖాన్‌కు శిక్ష ఖరారు చేస్తూ బుధవారం మధ్యాహ్నం కోర్టు తుది తీర్పు వెల్లడించిన వెంటనే సల్మాన్ ఖాన్ తరుపు నాయ్యవాదులు, కుటుంబ సభ్యులు బెయిల్ కోసం బాంబే హైకోర్టు ఆశ్రయించారు. బెయిల్ పిటీషన్ ను హైకోర్టు వెంటనే విచారణకు స్వీకరించింది. సల్మాన్ తరుపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. అనంతరం కోర్టు రెండు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

సల్మాన్ ఖాన్‌కు అలా శిక్ష ఖరారైందో లేదో.... ఆయన తరుపు లాయర్లు అంతకంటే స్పీడుగా మధ్యాహ్నం 3 గంటలకు ముంబై హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. సెసన్స్ కోర్టు తీర్పును నిలిపివేయాలని, బెయిల్ ఇవ్వాలని పిటీషన్లో పేర్కొన్నారు. 4 గంటలకు విచారణ ప్రారంభం అయింది. బెయిల్ మంజూరైంది. సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు అందితే సల్మాన్ ఈరోజు సాయంత్రమే బయటకు రాబోతున్నాడు. లేటయితే మాత్రం ఈ రోజు రాత్రి సల్మాన్ జైలులోనే గడపబోతున్నాడు.
ఈ పరిణామాలు పరిశీలిస్తే....సల్మాన్ ఖాన్ కు శిక్ష పడుతుందని ఆయన తరుపు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు ముందే ఊహించినట్లు స్పష్టమవుతోంది. అందుకే ముందస్తుగా బెయిల్ పిటీషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రోజు సాయంత్రం సల్మాన్ ఖాన్ బెయిల్ తీసుకుని బయటకు రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











