twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ సిక్స్‌ప్యాక్ బాడీ ఫేకే....ఇదిగో సాక్ష్యం

    By Bojja Kumar
    |

    ముంబై : అవును. మీరు చదివింది నిజమే!...బాలీవుడ్ కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ఆ మధ్య వచ్చిన ఏక్ థా టైగర్ చిత్రంలో చూపించిన సిక్స్ ప్యాక్ బాడీ ఫేకే. బాలీవుడ్లో ఫిట్‌గా ఉండే హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. అయితే ఆ సినిమాలో ఆయన పొట్ట భాగంపై కనిపించిన సిక్స్ ప్యాక్ మాత్రం నికిలీదే. విఎఫ్‌ఎక్స్ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని మనకు అలా చూపించారు.

    తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం....2012 సంవత్సరంలో సల్మాన్ హీరోగా వచ్చిన 'ఏక్ థా టైగర్' చిత్రంలో సల్మాన్ సిక్స్ ప్యాక్ కేవలం కంప్యూటర్ గ్యాఫిక్సే అని తేలింది. సల్మాన్ రోజూ వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉంటారు. ఆయన పొట్టభాగం ప్లాట్ గా మాత్రమే ఉంటుంది. అయితే సినిమాలో ఆకర్షణీయంగా సిక్స్ ప్యాక్ కనిపించేందుకు ఈ టెక్నిక్ ఉపయోగించారు.

    సిక్స్ ప్యాక్ ఉన్నా...లేకున్నా సల్మాన్ ఖాన్ ఇప్పటికీ బాలీవుడ్లో హాటెస్ట్ హీరోనే....ఇప్పటికీ ఆయన అక్కడ టాప్ హీరోగానే కొనసాగుతున్నారు, మరికొంత కాలంగా కొనసాగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.

    సల్మాన్ ఖాన్ సిక్స్ ప్యాక్ టెక్నిక్ ఇదే..


    ఇక్కడ కనిపిస్తున్న చిత్రాన్ని గమనిస్తే....విఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఉపయోగించి సల్మాన్ ఖాన్ ఫ్లాట్ పొట్టపై ఎలా సిక్స్ ప్యాక్ కనిపించేలా చేసారో స్పష్టమవుతుంది.

    ఏక్ థా టైగర్ చిత్రంలో సల్మాన్ ఏజెంటుగా కనిపించారు


    ఏక్ థా టైగర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ భారత గూడచార సంస్థ RAW ఏజెంటుగా కనిపించారు.

    యశ్ రాజ్ ఫిలింస్ చిత్రంలో సల్మాన్ తొలిసినిమా


    ‘ఏక్ థా టైగర్' యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో సల్మాన్ ఖాన్ చేసిన తొలి చిత్రం...ఈ చిత్రంలో సల్మాన్ సరసన కత్రినా హీరోయిన్‌గా నటించింది.

    భారీ విజయం సాధించిన చిత్రం...


    ఏక్ థా టైగర్ చిత్రం యాశ్ రాజ్ ఫిలింస్ బేనర్లో రూపొందించిన భారీ విజయవంతమైన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్లో ఈచిత్రం సెకండ్ హైయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.

    పాకిస్థాని ఏజెంగా నటించిన కత్రినా...


    ఏక్ థా టైగర్ చిత్రంలో కత్రినా కైఫ్ పాకిస్థాన్ గూడచార సంస్థ ఐఎస్ఐ ఏజెంటుగా నటించింది. అందులో ఆమె పాత్ర పేరు జోయా.

    అదరగొట్టిన కబీర్ ఖాన్...


    ఏక్ థా టైగర్ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆయన ప్రేక్షక రంజకంగా రూపొందించడంలో సక్సెస్ అయ్యారు.

    పాటలు, ఫైట్స్ అదిరాయి....


    ఏక్ థా టైగర్ చిత్రం ఆ రేంజిలో విజయం సాధించడానికి ఆడియో, పాటల చిత్రీకరణ, యాక్షన్స్ సీక్వెన్స్ కూడా ఓ కారణమే.

    English summary
    Yes, you read it right! Believe it or not, the six pack abs that Salman Khan flaunted in the movie Ek Tha Tiger were fake. Though Salman is known as one of the fittest actors of Bollywood, in Ek Tha Tiger he used VFX technology to show that chiseled body.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X