»   » ‘గే’తో సల్మాన్‌కు రిలేషన్.. కేజ్రీవాల్‌ను చంపుతా.. ‘బిగ్ బాస్’ స్వామి ఆరోపణలు

‘గే’తో సల్మాన్‌కు రిలేషన్.. కేజ్రీవాల్‌ను చంపుతా.. ‘బిగ్ బాస్’ స్వామి ఆరోపణలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు బిగ్‌బాస్ 10లో పాల్గొన్న రోహన్ మెహ్రాతో శారీరక సంబంధం ఉందని స్వామి వ్యాఖ్యలు చేయడం హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్నది. సాయి ఓం తాజా ఆరోపణలతో కూడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

బిగ్ బాస్ ముగిసినా.. వేడి తగ్గని కార్యక్రమం

బిగ్ బాస్ ముగిసినా.. వేడి తగ్గని కార్యక్రమం

వివాదాస్పద రియాల్టీ షో బిగ్ బాస్ 10 ఫైనల్ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా ముగిసినప్పటికీ సాయి ఓం ఆరోపణలతో ఆ కార్యక్రమం ఇంకా శుభం కార్డు పడలేదు. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

సల్మాన్‌ను చెంపదెబ్బ కొట్టా..

సల్మాన్‌ను చెంపదెబ్బ కొట్టా..

బిగ్ బాస్ 10 ఫైనల్ రోజున తనను చంపుతానని బెదిరించాడని, తనకు ఎయిడ్స్ వ్యాధి ఉందని సల్మాన్ ఆరోపించడంతో తాను సల్మాన్ ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టానని బాబా సాయి ఓం తెలుపడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అంతేకాకుండా ‘గే' రోహన్ మెహ్రాతో ఫిజికల్ రిలేషన్ ఉందని బాబా పేర్కొన్నాడు.

నితిబా డ్రగ్స్ తీసుకొన్నది...

నితిబా డ్రగ్స్ తీసుకొన్నది...

ఆరోపణలు సల్మాన్‌కే పరిమితం కాకుండా స్వామిజీ నితిబా అనే బిగ్‌బాస్ సెలబ్రిటీని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. బిగ్‌బాస్ హౌస్‌లో నితిబా డ్రగ్స్ తీసుకున్నదని, మను పంజాబీ, మన్వీర్ గుర్జార్, మోనాలిసాతో కలిసి హౌస్ నుంచి బయటకు వెళ్లిందని ఆరోపించారు.

స్వామి మాటలను లైట్ తీస్కో..

స్వామి మాటలను లైట్ తీస్కో..

ఎప్పుడూ వివాదాల్లో కూరుకుపోయే స్వామిజీ చేసిన ఆరోపణలను బాలీవుడ్ వర్గాలు తేలికగా తీసుకుంటున్నాయి. అయితే మరికొందరు నిప్పులేనిదే పొగ రాదనే అంటున్నారు.

ఎవరీ సాయి ఓం మహారాజ్

ఎవరీ సాయి ఓం మహారాజ్

వివాదాస్పద సాయి ఓం మహారాజ్ అసలు పేరు వినోద్ ఆనంద్ ఝా ఎస్. సదాచారి సాయిబాబా. ఈయన మామూలు సాధువు అనుకుంటే పొరపాటే. ఈయన జోతిష్య శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రవృత్తి రాజకీయాలు, జ్యోతిషం చెప్పడం.

ఢిల్లీ అసెంబ్లీకి పోటీ

ఢిల్లీ అసెంబ్లీకి పోటీ

గత ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అఖిల భారతీయ హిందూ మహాసభ తరఫున పోటీ చేశారు. అప్పుడప్పుడు బీజేపీ సభ్యుడని, ప్రధాని మోదీ సలహాలు, సహాయం తీసుకొంటారని చెప్పుకొంటాడు.

కేజ్రీవాల్‌ను చంపుతా..

కేజ్రీవాల్‌ను చంపుతా..

ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘కేజ్రీవాల్‌‌ను చంపుతా‌' అని వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమైంది. ఇటీవల బిగ్ బాస్ 10లో పాల్గొన్నాడు. పేరుకు అవివాహితుడైనా అమ్మాయిలు, పలువురితో శారీరక సంబంధాలున్నాయని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

వివాదాస్పద సాధువు రాధే మా గురించి ఓ టెలివిజన్ చానల్ లో చర్చ సందర్భంగా ఓ మహిళ చేతిలో దాడికి గురయ్యారు.

English summary
Swami Om Maharaj claims Salman Khan had a physical relation with another ex-contestant Rohan Mehra, who is a gay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu