మళ్లీ రామ్ చరణ్ కఠినమైన ట్రైనింగ్.... సల్మాన్ స్పెషల్ కేర్: ట్విట్ చేసిన ఉపాసన

By Bojja Kumar

'ధృవ' సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కఠినమైన డైట్ ఫాలో అవ్వడంతో పాటు, స్పెషల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ అవన్నీ మానేశాడు. 'రంగస్థలం' చిత్రంలో మొరటుగా, బండగా కనిపించాలి కాబట్టి గ్రామాల్లో సాధారణంగా ఎలా కనిపిస్తారో అలాంటి లుక్ లోకి వచ్చేశాడు. ఈ సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తర్వాతి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు.

న్యూలుక్ కోసం...

న్యూలుక్ కోసం...

రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో చెర్రీ న్యూలుక్‌లో కనిపించబోతున్నారు. ‘రంగస్థలం' చిత్రంలో గడ్డంతో కనిపించిన మెగా పవర్ స్టార్ తన తర్వాతి సినిమాలో పూర్తిగా విభిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నారు.

కఠినమైన డైట్, ఫిట్‌నెస్ ట్రైనింగ్

కఠినమైన డైట్, ఫిట్‌నెస్ ట్రైనింగ్

కొత్త గెటప్‌ కోసం తన డైట్ పూర్తిగా మార్చుకున్నాడు చరణ్. కఠినమైన ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు. ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ రాకేష్ ఉదియర్‌ పర్యవేక్షణలో చరణ్‌ వర్క్‌వుట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ప్రత్యేకించి చరణ్‌ కోసమే రాకేష్ ను పంపించారట.

ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఉపాసన

రామ్ చరణ్‌, రాకేష్ ఉదియర్‌ జిమ్‌లో దిగిన ఫొటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న ఉపాసన... ‘ఇతన్ని గుర్తుపట్టారా? రాకేష్ పర్యవేక్షణలో మిస్టర్‌ సి మళ్లీ తన స్ట్రిక్ట్‌ ట్రైనింగ్‌ సిద్ధమయ్యారు. సల్మాన్‌ భాయ్‌ ప్రత్యేకించి చరణ్‌ కోసం రాకేష్‌ను ఇక్కడకు పంపించారు. మిస్టర్‌ సి. వర్క్‌ అవుట్‌ ప్లాన్‌, డైట్‌ గురించి మీకూ తెలుసుకోవాలని ఉందా? త్వరలోనే ఆ విషయాలు వెల్లడిస్తాను' అని ట్వీట్‌లో పేర్కొన్నారు ఉపాసన.

బోయాపాటి-చరణ్ సినిమా

బోయాపాటి-చరణ్ సినిమా

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, నవీన్ చంద్ర, స్నేమ, ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X