అనుచితంగా ప్రవర్తించా సారి...క్షమాపణ కోరిన స్టార్ హీరో
"నా అనుచిత వ్యాఖ్యలతో ఎవరి హృదయాలైనా గాయపడి ఉంటే క్షమించాలని కోరుతున్నాను..ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదని సల్మాన్ ఖాన్ బహిరంగంగా మీడియా ముఖంగా క్షమాపణ కోరుతూ ప్రకటన చేసారు. చెప్పారు. అలాగే నిఘా వర్గాలు, సైనిక, పోలీస్ దళాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. 26/11 ఉగ్రవాద దాడిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ చివరికి దిగొచ్చారు.పాకిస్థాన్‌కు చెందిన 24/7 ఛానెల్‌కు మూడు వారాల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ "స్టార్ హోటల్స్ , ప్రభావవంతమైన వ్యక్తులే లక్ష్యంగా ఆనాడు దాడి జరిగింది. అందుకే వాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఎక్కువ ప్రచారం చేశారు. అంతకు ముందు రైళ్లపైనా, చిన్న పట్టణాల్లోనూ దాడులు జరిగాయి. కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడలేదు" అని సల్మాన్ అన్నారు.దీనిపై భాజపా, శివసేన, కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అయితే ఈ విషయంలో సల్మాన్‌ఖాన్‌కు ఎంఎన్ ఎస్ అధినేత రాజ్‌థాకరే నుంచి మద్దతు లభించింది. ఆయన వ్యాఖ్యలపై మీడియా ఎక్కువగా స్పందించిందని వ్యాఖ్యానించారు.సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో బేషరతుగా క్షమాపణ కోరారు. ఇక సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం దబాంగ్ సూపర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











